లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ సరికొత్త వ్యూహం.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?
ఇంతకీ సిట్టింగుల్లో సీట్లు దక్కించుకునే వారు ఎవరు? గల్లంతు అయ్యేది ఎవరికి? కొత్తగా లోక్ సభ బరిలో దిగే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? దీనిపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..

KCR Focus On BRS Lok Sabha Candidates Selection
BRS Lok Sabha Candidates : బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఈసారి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్ లో ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన గులాబీ దళపతి వచ్చే పార్లమెంట్ సెషన్ లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడడమే బీఆర్ఎస్ కర్తవ్యం అని, ఆ దిశగా ముందుకు సాగాలని ఎంపీలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లందరికీ సీట్లు ఇచ్చి దెబ్బతిన్న బీఆర్ఎస్.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పూర్తిగా వ్యూహం మార్చనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునే వ్యూహంలో భాగంగా ఈసారి సిట్టింగుల్లో అందరికీ టికెట్లు దక్కపోవచ్చని తెలుస్తోంది. ఇంతకీ సిట్టింగుల్లో సీట్లు దక్కించుకునే వారు ఎవరు? గల్లంతు అయ్యేది ఎవరికి? కొత్తగా లోక్ సభ బరిలో దిగే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? దీనిపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..
Also Read : పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్.. చర్యలకు ఈసీకి ఆదేశం
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
బీబీ పాటిల్, సిట్టింగ్ ఎంపీ
———————-
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం
రంజిత్‌రెడ్డి, సిట్టింగ్ ఎంపీ
—————————
మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
మాలోతు కవిత, సిట్టింగ్ ఎంపీ
————————
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం
నామా నాగేశ్వరరావు, సిట్టింగ్ ఎంపీ
—————————-
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం
వెంకటేశ్ నేత, సిట్టింగ్ ఎంపీ
కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
——————
మెదక్ లోక్‌సభ నియోజకవర్గం
కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే
వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ
————————-
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం
MSN రెడ్డి, సిట్టింగ్ ఎంపీ
శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
———————
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం
పి.దయాకర్, సిట్టింగ్ ఎంపీ
రాజయ్య, మాజీ మంత్రి
—————————–
నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం
రాములు, సిట్టింగ్ ఎంపీ
గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే
——————————
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం
వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
——————————
ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే
—————————-
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
కవిత, ఎమ్మెల్సీ
జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
——————————
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం
శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ
బొంతు రామ్మోహన్, మాజీ మేయర్
———————————
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
తలసాని సాయికిరణ్, 2019 అభ్యర్థి
రావుల శ్రీధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్‌నేత
—————————————
నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం
పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత
—————————————
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం
గుత్తా అమిత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ యువనేత
బాలరాజు యాదవ్, బీఆర్‌ఎస్ నాయకుడు
————————————
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
పి.శ్రీకాంత్
2019 అభ్యర్థి
————————————
Also Read : రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసిన ఇంటెలిజెన్స్ విభాగం.. ఎందుకంటే?
* కొలిక్కి వచ్చిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల కసరత్తు
* నలుగురు సిట్టింగ్ లకు లైన్ క్లియర్
* ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత
* జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, చేవెళ్లలో మళ్లీ రంజిత్ రెడ్డి
* పెద్దపల్లిలో సిట్టింగ్ వర్సెస్ బీఆర్ఎస్ నేత మధ్య పోటాపోటీ
* సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, మాజీమంత్రి కొప్పులలో ఒకరికి ఛాన్స్
* గత ఎన్నికల్లో పోటీ చేసిన వినోద్ కు మరో ఛాన్స్
* సీటు దక్కని వారిలో వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు
* ఎమ్మెల్యేగా ఎంపికైన కొత్త ప్రభాకర్ రెడ్డి