Delhi Winter Action Plan : వాయు కాలుష్యంపై కేజ్రీ వ్యూహాలు..10 పాయింట్లు

కాలుష్యం అధికం కావడానికి పంట వ్యర్థాలను తగుబెట్టడమేనని ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.

Kejriwal Delhi

Delhi CM Winter Action : శీతాకాలం వచ్చిదంటే..చాలు దేశ రాజధాని గజగజ వణికిపోతుంది. చలితో కాదు..కాలుష్యంతో. అత్యధిక కాలుష్యం వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం చలికాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే అలర్ట్ అయ్యింది కేజ్రీవాల్ సర్కార్. కాలుష్యం అధికం కాకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు పది వ్యూహాలను సిద్ధం చేశారు. వింటర్ యాక్షన్ ప్లాన్ పేరిట ప్రణాళికలను ప్రకటించింది. ఈ మేరకు 2021, అక్టోబర్ 04వ తేదీ సోమవారం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.

Read More : AP Crime : 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం..

కాలుష్య నివారణకు పరస్పరం సహకరించుకుంటూ..ముందుకు పోదామని పొరుగు రాష్ట్రాలకు ముందుగా విజ్ఞప్తి చేశారు. పంట వ్యర్థాలను పొరుగు రాష్ట్రాల్లో కాల్చడం ద్వారా ఢిల్లీలో అధిక కాలుష్యానికి ఓ కారణమని అభిప్రాయాలు ఉన్నాయి. పంట వ్యర్థాలను కాల్చకుండా..బయో డీ కంపోజర్ స్ర్ర్పే చేయడం, దుమ్ము, ధూళి కాలుష్యాన్ని నియంత్రణకు కార్యచరణ, గ్రీన్ ఢిల్లీ యాప్, దేశంలోనే తొలి ఈ వ్యర్థాల పార్కు, గ్రీన్ వార్ రూములను బలోపేతం చేయడం, వాహనాల కాలుష్య నియంత్రణ చేయడం, బాణసంచాపై నిషేధం, చెత్తను తగులబెడితే జరిమాన విధించడం, స్మాగ్ టవర్లను ఏర్పాటు చేయడం, హాట్ స్పాట్ ల పర్యవేక్షణ..వంటి అంశాలున్నాయని కేజ్రీవాల్ తెలిపారు.

Read More : Lion In Toilet : జెంట్స్ టాయిలెట్ లోంచి బయటకొస్తున్న ఆడ సింహం..ఇదేం సిగ్గురా బాబూ అంటున్న జనాలు..

కాలుష్యం అధికం కావడానికి పంట వ్యర్థాలను తగుబెట్టడమేనని ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు. పంట వ్యర్థాల మేనేజ్ మెంట్ కు ఢిల్లీ మాదిరిగానే..బయో డీ కంపోజర్ పద్ధతిని విస్తృతంగా అమలు చేయాలని కోరారు. చెత్తను తగులబెట్టే అంశాన్ని పర్యవేక్షించేందుకు సుమారు 250 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్మాణాల కట్టడాల నుంచి వచ్చు ధూళిని నియంత్రణకు 75 బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు. స్మాగ్ టవర్ మంచి ఫలితాలను ఇస్తోందని, నగరంలో ఇలాంటి మరిన్ని టవర్ల నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. ప్రస్తుతం వాయుకాలుష్యం అదుపులోనే ఉందని చెప్పిన ఆయన…కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లు తనిఖీ చేసేందుకు 500 బృందాలు పని చేస్తాయన్నారు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు..ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలను పరిష్కరించేందుకు 64 రహదారులను గుర్తించడం జరిగిందని తెలిపారు.