AP Crime : 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం..

ఏపీలోని చిత్తూరుజిల్లా పలమనేరులో 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

AP Crime : 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం..

Ap Crime

16 years old boy raped 80years old woman : 6 ఏళ్ల చిన్నారి కాదు ఆరు నెలల చిన్నాలను కూడా వదలటంలేదు కామాంధులు. వృద్ధులను కూడా వదలని అత్యంత దారుణ ఘటనలో ఆడజాతి పుట్టులకే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటువంటి మరో అత్యంత దారుణ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 80 ఏళ్ల వృద్ధురాలిపై 16ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరేళ్ల మనవరాలిపై అత్యాచార యత్నం చేయగా..భయపడిపోయిన బాలిక అరవడంతో అక్కడినుంచి పారిపోయిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది.

పలమనేరు పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో ఒంటరిగా ఉంటున్న 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నూనూగు మీసాన వయస్సులోనే కామంతో కళ్లు మూసుకుపోయిన బాలుడు మంచంలో కదలలేని స్థితిలో ఉన్న 80యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వింటుంటేనే..ఒళ్లు జలదరిస్తోంది. ఛీ..ఇంత అమానవీయ దుస్థితులకు దిగజారిపోయిందా సమాజం అనిపిస్తోంది.

Read more :Lion In Toilet : జెంట్స్ టాయిలెట్ లోంచి బయటకొస్తున్న ఆడ సింహం..ఇదేం సిగ్గురా బాబూ అంటున్న జనాలు..

పలమనేరు పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో 80యేళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె సమీప బంధువులు అక్కడకు కాస్త దూరంలో ఉంటున్నారు.ఈక్రమంలో అదే కాలనీలో జులాయిగా తిరిగే 16యేళ్ల ఓ బాలుడు శనివారం (అక్టోబర్ 3,2021)మధ్యాహ్నం వృద్ధురాలు మంచంమీద కదలలేని స్థితిలో ఉండగా గమనించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గంట తరువాత వృద్ధురాలి మనుమరాలైన ఆరేళ్ల బాలిక అవ్వకోసం భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది.

బాలికపై కూడా అత్యాచారం చేయటానికి యత్నించాడు. కానీ భయంతో ఆ బాలిక పెద్ద పెద్దగా అరవటంతో వీడు పారిపోయాడు. పొరుగూరిలో పనులు చూసుకుని ఆదివారం ఇంటికి వచ్చిన తండ్రికి బాలిక జరిగిన సంఘటన గురించి తనకు తెలిసిన రీతిలో చెప్పింది.దీంతో బాలిక తండ్రి పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వృద్ధురాలు, బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెరుగుతున్న విచ్చలవిడితనం, అశ్లీలత.. సమాజం మీద పెను ప్రభావాలు చూపిస్తున్నాయి. ఫోర్న్ సైట్లు యువతను ఇటువంటి దారుణాలకు పాల్పడేలా చేస్తున్నాయి.

Read more :Supreme Court : వ్యవసాయ చట్టాలు అమల్లో లేనప్పుడు నిరసనలెందుకు?