చలి చంపేస్తోంది : 118 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత

ఉత్తర భారతం చలితో గజ గజ వణికిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవవ్వడం ఇది

  • Publish Date - December 28, 2019 / 01:45 AM IST

ఉత్తర భారతం చలితో గజ గజ వణికిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవవ్వడం ఇది

ఉత్తర భారతం చలితో గజ గజ వణికిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవవ్వడం ఇది రెండోసారి. చలితో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 

దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి పులితో జనం వణికిపోతున్నారు. శుక్రవారం(డిసెంబర్ 27,2019) ఉష్ణోగ్రత 4.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కన్న 3 డిగ్రీలు తక్కువ. ఢిల్లీలో డిసెంబర్‌ 14 నుంచి వరుసగా 13 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. డిసెంబర్‌ నెలలో ఉష్ణోగ్రతలు ఇలా పడిపోవడం 1901 తర్వాత ఇది రెండోసారి. 1919, 1929, 1961, 1997లలో మాత్రమే డిసెంబర్ నెలలో ఢిల్లీలో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. 2019 డిసెంబర్‌లో ఇప్పటికే అత్యల్పంగా 19.85 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. డిసెంబర్ 31 నాటికి ఉష్ణోగ్రతలు 19.15 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. 118 ఏళ్ల తర్వాత ఢిల్లీ చరిత్రలో రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. 

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మైనస్‌ 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న దాల్‌ లేక్‌లోని నీరు గడ్డకట్టుకుపోతోంది. దీంతో పడవలు సాఫీగా నడపలేకపోతున్నారు. అయితే ప్రకృతి సౌందర్యం పర్యాటకులకు కనువిందు చేయనుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోనూ చలి చంపేస్తోంది. ఉన్ని దుస్తులు వేసుకుని చలి మంటలతో జనం సేద తీరుతున్నారు. 

పాట్నాలో అడ్డా కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. వారికి ఎలాంటి షెల్టర్‌ లేకపోవడంతో రోడ్డుపైనే చలిలో పనికోసం వేచి చూస్తున్నారు. వారణాసిలో చలికి తోడు రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టీ తాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

* ఉత్తరాదిని వణికిస్తున్న చలిపులి
* ఢిల్లీలో ఎముకలు కొరికే చలి
* 4.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
* 118 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత
* ఢిల్లీలో శుక్రవారం ఉష్ణోగ్రత 4.2 డిగ్రీల సెల్సియస్ నమోదు
* డిసెంబర్‌ 14 నుంచి వరుసగా పడిపోతున్న ఉష్ణోగ్రత

Also Read : New Year సెలబ్రేషన్స్‌‌కు ఇండియాలో బెటర్ ఆప్షన్స్