Delhi Thick Smog : దీపావళి ఎఫెక్ట్, ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు

దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై దట్టమైన పొగమంచు కప్పేయడంతో దృశ్యమానత తగ్గి వాహనాల రాకపోకలకు కష్టతరంగా మారింది....

Delhi Thick Smog

Delhi Thick Smog : దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై దట్టమైన పొగమంచు కప్పేయడంతో దృశ్యమానత తగ్గి వాహనాల రాకపోకలకు కష్టతరంగా మారింది. దీపావళి రోజు పటాకులు కాల్చవద్దని సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రభుత్వం నిషేధించినా ప్రజలు దాన్ని ఉల్లంఘించారు. దీపావళి రోజు రాత్రి ప్రజలు క్రాకర్లు పేల్చడంతో దేశ రాజధానిని పొగమంచు చుట్టుముట్టింది.

ALSO READ : Helicopter Crash : సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్…అయిదుగురి మృతి

ఢిల్లీ నగరం అంతటా భారీ కాలుష్యానికి దారితీసింది. ఇప్పటికే దిగజారుతున్న గాలి నాణ్యతతో అల్లాడుతున్న ఢిల్లీలో బాణసంచా కాల్చడంతో మరింత కాలుష్యం పెరిగింది. దీపావళి తర్వాత కాలుష్యం స్థాయి పెరిగి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కష్టతరంగా మారింది. చాలా ప్రాంతాల్లో వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఇటీవల ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం పటాకులపై పూర్తి నిషేధం విధించింది.

ALSO READ : Celebrity Look : ఎన్టీఆర్ ఫ్యామిలీ దివాళీ.. దీపాల వెలుగుల్లో అనుపమ.. శ్రీవారుతో కియారా పిక్స్..

కాలుష్యం అలముకున్న నేపథ్యంలో కాలుష్య స్థాయిని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించాలనే ఆలోచనను కూడా ప్రభుత్వం చేసింది. వివిధ ప్రదేశాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు బాణాసంచా కాల్చారు. లోధి రోడ్, ఆర్‌కె పురం, కరోల్ బాగ్, పంజాబీ బాగ్ ప్రాంతాల్లో ప్రజలు ఆదివారం రాత్రి బాణాసంచా కాల్చారు.

ALSO READ : Revanth Reddy : నిరూపిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయం- రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. దీంతో పాఠశాలలను మూసివేసి ట్రక్కుల ప్రవేశాన్ని కూడా పరిమితం చేసింది. దీపావళి పండుగకు ముందు ఢిల్లీలో గాలి నాణ్యత కొంత మెరుగుపడింది. శుక్రవారం కురిసిన వర్షం,అనుకూలమైన గాలి వేగం కారణంగా కాలుష్య కారకాల వ్యాప్తి తగ్గినా, బాణసంచా కాల్చడంతో మళ్లీ పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు