Helicopter Crash : సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్…అయిదుగురి మృతి

అమెరికాలో ఓ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సభ్యులు మరణించారు. శిక్షణలో భాగంగా మధ్యధరా సముద్రంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సభ్యులు మరణించారని అమెరికా అధికారులు తెలిపారు....

Helicopter Crash : సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్…అయిదుగురి మృతి

US Helicopter Crash

Updated On : November 13, 2023 / 4:53 AM IST

Helicopter Crash : అమెరికాలో ఓ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సభ్యులు మరణించారు. శిక్షణలో భాగంగా మధ్యధరా సముద్రంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సభ్యులు మరణించారని అమెరికా అధికారులు తెలిపారు. ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎగురుతుందో అధికారులు పేర్కొనలేదు, అయితే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయ సంఘర్షణగా మారకుండా నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ మధ్యధరా సముద్రంలో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను మోహరించింది.

ALSO READ : IND vs NED : నెద‌ర్లాండ్స్ పై టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం.. తొమ్మిదికి తొమ్మిది..

సైనిక శిక్షణలో భాగంగా ఐదుగురు సర్వీస్ సభ్యులను తీసుకువెళుతున్న యూఎస్ సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురై మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. హెలికాప్టరులో ఉన్న ఐదుగురు సర్వీస్ సభ్యులు మరణించారని యూఎష్ యూరోపియన్ కమాండ్ తెలిపింది. అధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటనలో మృతులకు నివాళులర్పించారు. ‘‘మా సైనిక సభ్యులు ప్రతిరోజూ మన దేశం కోసం వారి జీవితాలను త్యాగం చేశారు’’ అని బిడెన్ చెప్పారు.

ALSO READ : Hyderabad : హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో విషాదం, మంట్లలో చిక్కుకుని భర్త మృతి

అమెరికన్ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి సైనికులు రిస్క్ తీసుకుంటారు.వారి ధైర్యం, నిస్వార్థత మన దేశంలో ఉత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను గుర్తించిన రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. హమాస్ దాడి అనంతరం గాజాపై ప్రతి దాడి కోసం వాషింగ్టన్ ఇజ్రాయెల్ కు సైనిక మద్ధతు అందించింది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో గాజాలో 11,100 మంది మరణించారు.

ALSO READ : Revanth Reddy : నిరూపిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయం- రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన పలువురు గాయపడ్డారు. అమెరికా మిలటరీ విమానాలు ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏప్రిల్‌లో అలస్కాలోని మారుమూల ప్రాంతంలో శిక్షణా మిషన్ నుంచి తిరిగి వస్తున్న రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో ముగ్గురు యూఎస్ సైనికులు మరణించగా, మరొకరు గాయపడ్డారు. గత నెలలో కెంటుకీలో రాత్రిపూట శిక్షణా మిషన్‌లో రెండు యూఎస్ ఆర్మీ హెలికాప్టర్లు కూలిపోయాయి.

ALSO READ : Revanth Reddy : రాజాసింగ్‌పై ఎందుకు పోటీ చేయడం లేదు? మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి సిద్ధమా?- ఓవైసీకి రేవంత్ రెడ్డి సవాల్

ఈ దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మంది సైనికులు మరణించారు. గత సంవత్సరం నార్వేలో నాటో వ్యాయామాల సమయంలో వారి వి-22బి ఓస్ప్రే విమానం కూలిపోయినప్పుడు నలుగురు యూఎస్ మెరైన్లు మరణించారు.