Revanth Reddy : రాజాసింగ్‌పై ఎందుకు పోటీ చేయడం లేదు? మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి సిద్ధమా?- ఓవైసీకి రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy Challenge Asaduddin Owaisi : కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో ఓవైసీ పార్టీ ఇచ్చారు. పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్ధమా?

Revanth Reddy : రాజాసింగ్‌పై ఎందుకు పోటీ చేయడం లేదు? మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి సిద్ధమా?- ఓవైసీకి రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy Challenge Asaduddin Owaisi (Photo : Google)

Updated On : November 12, 2023 / 7:59 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం హీట్ ఎక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజల ముందు ప్రత్యర్థిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

అసదుద్దీన్ ఓవైసీ శర్వాణి లోపల పైజామా ఉందని అనుకున్నా, ఖాకీ నిక్కర్ ఉందని అర్థమైందని రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయనను బారిష్టర్ చదివించారు. కానీ, ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి అసదుద్దీన్ మద్దతుగా ఉంటున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గోశామహల్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? అని ఓవైసీని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, మోదీ లాంటి దొంగలను కాపాడడానికి ఓవైసీ అబద్ధాలు చెపుతున్నారని ధ్వజమెత్తారు.

Also Read : వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే.. ఇంతకు ఇంత అనుభవిస్తారు.. వాళ్లకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్

”అసదుద్దీన్ ఓవైసీ కేసుల లాయర్ ఎవరు? నేను హిందువుని. నేను భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్తా. దర్గాకి రమ్మన్నా వస్తా. భాగ్యలక్ష్మి టెంపుల్ రమ్మన్నా వస్తా. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో ఓవైసీ పార్టీ ఇచ్చారు. పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్ధమా? మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్ధమా? శుక్రవారం నేను మక్కా మసీదు వస్తా. ఖురాన్ పట్టుకొని ప్రమాణం చేయడానికి ఓవైసీ రెడీనా?” అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

Also Read : ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు వేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైంది? కాంగ్రెస్ ఫైర్