Delhi Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ రిజల్ట్స్.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? ఏ సర్వే ఏం చెప్పిందో చూడండి..

కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ప్రక్రియలో 5వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.

Delhi Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ పీఠం ఎవరిది అనేది ఉత్కంఠ రేపుతోంది. శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన అరగంటకు ఎర్లీ ట్రెండ్స్ తెలిసే ఛాన్స్ ఉందంటున్నారు.

70 స్థానాలకు పోలింగ్..
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరిగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఫలితాలపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. గెలుపు తమదే అంటే తమదే అంటున్నాయి పార్టీలు. కాగా, మరోసారి గెలిచి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ ధీమాగా ఉంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని బీజేపీ అంటోంది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం 19 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఈసీ. ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. తర్వాత 8.30 కి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో 5వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.

కౌంటింగ్ సెంటర్లలోకి మొబైల్ ఫోన్లకు లేని అనుమతి లేదు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 36. 70 అసెంబ్లీ స్థానాలకు 699 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఢిల్లీలో 60.54 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి.

Also Read : అదానీ కొడుకు పెళ్లికి జస్ట్ రూ.10 లక్షలే ఖర్చు..

కీలక అభ్యర్థులు వీరే..
అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ నుంచి బరిలో నిలిచారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థిగా సందీప్ దీక్షిత్ పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి, ఢిల్లీ సీఎం అతిశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా అల్కా లాంబా, బీజేపీ నుంచి రమేశ్ బిదురి బరిలో ఉన్నారు. జంగ్ పురా స్థానంలో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, బీజేపీ నుంచి తర్విందర్ సింగ్, కాంగ్రెస్ నుంచి సింగ్ మర్వా బరిలో ఉన్నారు. శాకూర్ బస్తీలో ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్, బీజేపీ నుంచి కర్నైల్ సింగ్ పోటీలో ఉన్నారు.

బీజేపీకే జైకొట్టిన మెజార్టీ సర్వే సంస్థలు..
ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. మెజార్టీ సర్వే సంస్థలు బీజేపీకి పట్టంకట్టాయి. దేశ రాజధానిలో ఈసారి బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తుందని, అధికారం చేపట్టనుందని ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. కాగా.. కేకే సర్వే మాత్రం ఆప్ కి 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేయడం అత్యంత ఆసక్తికరంగా మారింది.

Also Read : బిగ్ సెక్యూరిటీ అలర్ట్.. ‘స్పార్క్‌క్యాట్’తో జర జాగ్రత్త.. మీ ఫోన్లలో పర్సనల్ డేటా దొంగిలిస్తోంది!

ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

మ్యాట్రిజ్‌..
బీజేపీ+ 35-40 సీట్లు
ఆప్‌ 32-37 సీట్లు
కాంగ్రెస్‌ 0-1 సీట్లు

పీఎంఏఆర్‌క్యూ..
ఆప్‌ 21-31 సీట్లు
బీజేపీ+ 39-49 సీట్లు
కాంగ్రెస్‌ 0-1 సీట్లు

జేవీసీ..
ఆప్ 22-31 సీట్లు
బీజేపీ+ 39-45 సీట్లు
కాంగ్రెస్‌ 0-2 సీట్లు

పీపుల్స్‌ పల్స్‌..
ఆప్ 10-19 సీట్లు
బీజేపీ+ 51-60 సీట్లు
కాంగ్రెస్‌ 0 సీట్లు

పీపుల్స్‌ ఇన్‌సైట్‌..
ఆప్ 25-29 సీట్లు
బీజేపీ+ 40-44 సీట్లు
కాంగ్రెస్‌ 1 సీటు

చాణక్య..
ఆప్ 25-28 సీట్లు
బీజేపీ+ 39-44 సీట్లు
కాంగ్రెస్‌ 2-3 సీట్లు

పోల్ డైరీ..
ఆప్ 18-25
బీజేపీ 42-50
కాంగ్రెస్ 0-2

డీవీ రీసెర్చ్..
ఆప్ 26-34
బీజేపీ ప్లస్ 36-44
కాంగ్రెస్ 0

వీప్రిసైడ్..
ఆప్ 46-52
బీజేపీ ప్లస్ 18-23
కాంగ్రెస్ 0-1