Gautam Adani Sons Wedding : అదానీ కొడుకు పెళ్లికి జస్ట్ రూ.10 లక్షలే ఖర్చు..

ప్రముఖ వజ్రాల వ్యాపారి, సి. దినేశ్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని జైమిన్ షా కూతురే దివా జైమిన్ షా. ఫైనాన్స్, వ్యాపార రంగాల్లో దివా టాలెంట్ చూసి ఫిదా అయ్యారట..

Gautam Adani Sons Wedding : అదానీ కొడుకు పెళ్లికి జస్ట్ రూ.10 లక్షలే ఖర్చు..

Updated On : February 7, 2025 / 4:47 PM IST

Gautam Adani Sons Wedding : ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, దివా జైమిన్ షా వివాహానికి అహ్మదాబాద్‌ వేదికైంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక జరుగుతోంది. వివాహ వేడుకలు ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్‌లోని అదానీ టౌన్‌షిప్ శాంతిగ్రామ్‌లో..  వివాహ వేడుకల్లో జైన, గుజరాతీ సంప్రదాయాలను అనుసరించనున్నారు.

కాగా, గౌతమ్ అదానీ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. తన కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా చేయడం లేదన్నారు. సాంస్కృతికంగా గొప్ప కార్యక్రమంగా ఉంటుందని తెలిపారు. అదానీ చేసిన ఈ ప్రకటనతో ఒక క్లారిటీ వచ్చింది. అదేమిటంటే.. టేలర్ స్విఫ్ట్ వంటి అంతర్జాతీయ సెలెబ్రిటీలు పెళ్లి వేడుకకు హాజరవుతారని గతంలో పుకార్లు వచ్చాయి. అందులో నిజం లేదని అదానీ ప్రకటనతో తేలిపోయింది.

Also Read : రతన్ టాటా వీలునామాలో షాకింగ్ పేరు? ఎవరీ మోహిని మోహన్ దత్తా.. ఈ మిస్టరీ మ్యాన్‌కు రూ. 500 కోట్లు రాసిచ్చాడు!

గత నెలలో ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద గంగా హారతి చేసిన తర్వాత అదానీ మాట్లాడుతూ.. పెళ్లి కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామన్నారు. “మా కుటుంబం సాధారణ, శ్రామిక-తరగతి జీవనశైలిని అనుసరిస్తుంది. గంగమ్మ ఆశీస్సులు తీసుకునేందుకు జీత్ కూడా ఇక్కడికి వచ్చాడు. వివాహం చాలా సాంప్రదాయ బద్దంగా జరుగుతుంది” అని గౌతమ్ అదానీ అన్నారు.

జీత్, దివాలు తమ పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. అందుకు బదులుగా దాతృత్వం చూపించారు. ఆపన్నులకు అండగా నిలవాలని నిర్ణయించారు. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ జంట కోసం శాలువలను రూపొందించడానికి NGO ఫ్యామిలీ ఆఫ్ డిసేబుల్డ్ (FOD)తో కలిసి పనిచేశారు.

జీత్ అదానీ దివ్యాంగులకు అండగా నిలిచారు. వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్న ఆయన.. అందుకు అనుగుణంగా ఫ్యామిలీ ఆఫ్ డిసేబుల్డ్ ఎన్జీవో చేసిన గ్లాస్‌వేర్, ప్లేట్లు పెళ్లి వేడుకలో వినియోగిస్తున్నారు.

అదానీ గొప్ప మనసు.. దివ్యాంగుల వివాహానికి రూ.10 లక్షలు
నూతన వధూవరులు అదానీ, దివా మంగళ సేవ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ యువతుల వివాహానికి రూ.10లక్షల చొప్పున సాయం అందజేయనున్నారు. ఈ నిర్ణయం తమకు ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ సాయంతో దివ్యాంగుల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా జీత్ అదానీ ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకున్న 21 మంది దివ్యాంగ మహిళలు, వారి భర్తలను కలిశారు.

ఎవరీ జీత్ అదానీ..
జీత్ అదానీ గౌతమ్ అదానీ చిన్న కొడుకు. అదానీ ఎయిర్‌పోర్ట్స్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. 2019లో గ్రూప్ CFO కార్యాలయంలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అదానీ గ్రూప్‌లోని వ్యూహాత్మక ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్‌, రిస్క్ మేనేజ్‌మెంట్, గవర్నెన్స్ విధానాలపై దృష్టి సారించాడు.

యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేట్ అయిన జీత్ శిక్షణ పొందిన పైలట్ కూడా. అతని తల్లి, ప్రీతి అదానీ ప్రేరణతో, అతను దాతృత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఆమె వారసత్వాన్ని అనుసరించి అదానీ ఫౌండేషన్‌ను ఒక ప్రధాన సామాజిక ప్రభావ సంస్థగా మార్చారు.

Also Read : మీకు జీతం తక్కువగా వస్తుందా? ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. లైఫ్ మొత్తం హ్యాపీగా బతికేయొచ్చు..!

ఎవరీ దివా జైమిన్ షా…
ప్రముఖ వజ్రాల వ్యాపారి, సి. దినేశ్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని జైమిన్ షా కూతురే దివా జైమిన్ షా. ప్రముఖ వజ్రాల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ కంపెనీ ముంబై, సూరత్‌లలో గణనీయమైన కార్యకలాపాలను కలిగి ఉంది. దివా షా హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినా.. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఫైనాన్స్, వ్యాపార రంగాల్లో దివా టాలెంట్ అదానీ ఫ్యామిలీని అట్రాక్ట్ చేసిందట.

జీత్ అదానీ, దివా జైమిన్ షాల వివాహం కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు. అర్థవంతమైన కారణంతో జరుపుకునే వేడుక కూడా. వీరి పెళ్లి వేడుక విలువలు, దాతృత్వాన్ని ప్రతిబింబిస్తుంది.