Delhi Election 2025 Result: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ

ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడికాగా అధిక శాతం సంస్థలు బీజేపీనే గెలుస్తుందని అంచనా వేశాయి. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కాసేపటి నుంచి ప్రారంభం కానుది. ఇప్పటికే ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మూడుసార్లు గెలిచింది. ఇప్పుడు గెలిస్తే నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న పార్టీగా నిలుస్తుంది.

ఇక బీజేపీ గెలిస్తే ఆ పార్టీ 27 ఏళ్ల తర్వాత సర్కారుని ఏర్పాటు చేసిన పార్టీగా నిలుస్తుంది. ఢిల్లీలో కౌంటింగ్‌ కోసం మొత్తం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడికాగా అధిక శాతం సంస్థలు బీజేపీనే గెలుస్తుందని అంచనా వేశాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అంటే ఒక్క ఆ ప్రాంతానికే కాకుండా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ ఉంటుంది. ఢిల్లీని ఆప్‌ ఎన్నో ఏళ్లుగా పరిపాలిస్తోంది కాబట్టి ఆ పార్టీపై సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఢిల్లీలోనూ గెలిచి సత్తా చాటాలని బీజేపీ చాలా కాలం నుంచే కసరత్తులు చేసింది.

ఢిల్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్‌ కీలక నేతలు అరెస్టులు కావడం సంచలనం రేపింది. ఎన్నికలు, రాజకీయ స్వార్థపర ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం తమపై కుట్ర పన్ని జైలుకు పంపిందని ఆప్‌ మొదటి నుంచీ అంటోంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ప్రభావం ఈ ఎన్నికలపై పడనున్నట్లు మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవిని అతిశీకి అప్పగించారు. ఇన్ని పరిస్థితుల మధ్య ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి.

YS Sharmila: జగన్‌ గురించి విజయసాయిరెడ్డి నాకు ఈ విషయాలు అన్నీ చెప్పేశారు: వైఎస్ షర్మిల