Delhi flood
Delhi flood – Yamuna : ఢిల్లీ మూడు రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. అయితే, యమునా నదిలో వరద ప్రవాహం కాస్త తగ్గింది. ఇవాళ ఉదయం 6 గంటలకు నీటి మట్టం 207.68 మీటర్లకి చేరింది. ప్రమాద స్థాయికి మించి 2.3 మీటర్లకు ఎగువనే యమునా నది(Yamuna River) ప్రవహిస్తోంది. నీరు నగరంలోకి చేరడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
అనేక కాలనీలు నీట మునిగాయి. యమునాలో వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఢిల్లీ రోడ్లపై నీరు తగ్గలేదు. ఐటీఓ వద్ద డ్రెయిన్ రెగ్యులేటర్ కు ఆర్మీ మరమ్మత్తులు పూర్తి చేసింది. అక్కడ వరద నీటితో సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మీ నగర్ కి వెళ్లే రోడ్లను పూర్తిగా మూసివేశారు.
సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీని కలిపే వికాస్ మార్గ్ మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మెట్రో ద్వారా మాత్రమే సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వెళ్లే సౌకర్యం ఉంది. రోడ్లు మూతపడటంతో ఢిల్లీ బ్లూ లైన్ మెట్రోలో రద్దీ పెరిగింది. మరోవైపు, నాళాల నుంచి రోడ్లపైకి యమునా వరద భారీగా చేరుతోంది. నేడు మరో రెండు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు తెరుచుకోనున్నాయి.
Heavy rainfall alert : పలు ప్రాంతాల్లో భారీవర్షాలు…108 మంది మృతి