Delhi Viral Video
Delhi Viral Video : నిరాశ్రయులైన ఎందరినో నిత్యం ఫుట్‌పాత్‌లపై చూస్తుంటాం. వారి కష్టనష్టాల సంగతి ఎలా ఉన్నా వారితో మాట కలపడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి మాట కలపడం కాదు ఓ నిరాశ్రయురాలైన మహిళతో కలిసి డ్యాన్స్ చేసింది. కన్నాట్ ప్లేస్‌లో సందడి చేసిన వీరి డ్యాన్స్ నెటిజన్లను ఫిదా చేసింది.
ఢిల్లీ నుంచి వైరల్ వీడియోలు అంటే మెట్రోలో వివాదాస్పద వీడియోలు గుర్తొస్తాయి. ఈసారి అందుకు భిన్నంగా ఓ అందమైన వీడియో అందరి మనసులు దోచుకుంది. ఈ వీడియోలో ఇద్దరు ఆడవాళ్లు డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. కన్నాట్ ప్లేస్‌లో వీరు చేసిన డ్యాన్స్ వీడియో అన్షిక అవస్థి (@anshikawasthi) అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేరైంది. అన్షిక నిరాశ్రయురాలై ఫుట్‌పాత్‌పై జీవిస్తున్న మహిళతో కలిసి డ్యాన్స్ చేసింది.
‘ఢిల్లీ అందంగా ఉంది. మీరు రకరకాల వ్యక్తులను కలుస్తారు. అనుకోకుండా వాళ్లతో కలిసి డ్యాన్స్ చేయడం సంతోషం కలిగిస్తుంది. సోమవారం శుభాకాంక్షలు.. అందరికీ’ అనే శీర్షకతో అన్షిక ఈ పోస్టును షేర్ చేసింది. వీడియోలో అన్షిక, ఆ మహిళ స్ట్రీన్‌ని డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చేశారు. పోటాపోటీగా స్టెప్పులు వేశారు. చివర్లో అన్షిక మహిళను ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
Delhi : ఢిల్లీకి డేంజర్ బెల్స్
‘ఈ వీడియో నా రోజును మార్చేసింది’ అని.. ‘మహిళ పట్ల మీరు ఎంతో దయ చూపించారు. నిజంగా మీకు ఆమె నుంచి ఆశీస్సులు అందుతాయి’ అంటూ వరుసగా కామెంట్లు పెట్టారు. తనపై ప్రశంసలు కురిపించిన అందరికీ ఆమె అన్షిక కృతజ్ఞతలు చెప్పింది.
Delhi is beautiful. You meet all sorts of people. And, the best ones are those who randomly join you in dance. Happy Monday, everyone! ?#Dance #Delhi #vibes pic.twitter.com/ffOPZuyU2D
— Anshika Awasthi (@anshikawasthi) July 10, 2023