elevated Eastern Cross Taxiways IGIA
Delhi elevated Eastern Cross Taxiways : దేశ రాజధాని ఢీల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే(elevated Eastern Cross Taxiways)ను కేంద్రం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ప్రారంభించారు. శుక్రవారం (జులై 14.2023) విమానాల కోసం వంతెనలాంటి టాక్సీవే కలిగిన ఎయిర్ పోర్టు ఇదే కావటం విశేషం. ఈ విమనాశ్రయంలో ‘ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే’లతోపాటు నాలుగో రన్ వేను మంత్రి సింధియా (Civil Aviation Minister Jyotiraditya Scindia) ప్రారంభించారు.
భారతదేశంలోనే అతిపెద్ద విమానశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు(Indira Gandhi International Airport). ఇక్క ప్రతీ రోజు 1500 కంటే ఎక్కువ విమనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.అటువంటి ఈ ఎయిర్ పోర్టులో ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవేతో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే (ECT)లతోపాటు నాలుగో రన్ వే (Run Way)ను మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు. 2.1 కిలోమీటర్ల పొడవు గల ఈ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే (Eastern Cross Taxiways)విమానం ల్యాండింగ్ తరువాత, విమానాలు బయలుదేరే ముందు టార్మాక్ పై ప్రయాణీకుల సమయాన్ని తగ్గిస్తుంది.
Sheela Bhatt on PM Modi: ఎంఏ చదువుతుండగా మోదీని కలిశానన్న జర్నలిస్ట్.. మరోసారి చర్చలో మోదీ డిగ్రీ
ఈ సందర్భంగా మంత్రి సింధియా మాట్లాడుతు..దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని..కొత్తగా ఈసీటీ అందుబాటులోకి రావడంతో.. కింది నుంచి రోడ్డు మార్గం.. పైనుంచి వంతెన తరహా టాక్సీవే కలిగి ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా ఐజీఐఏ పేరొందిందని తెలిపారు.
కాగా..విమానాశ్రయంలోని టర్మినళ్లు, హ్యాంగర్లను రన్‌వేలతో అనుసంధానించే ప్రత్యేక మార్గాలే టాక్సీవేలు. ఈసీటీ పొడవు 2.1 కి.మీలు. ఇది దిల్లీ విమానాశ్రయంలోని ఉత్తర, దక్షిణ ఎయిర్‌ఫీల్డ్‌లను అనుసంధానిస్తుంది. మూడో రన్‌వే నుంచి టర్మినల్- 1కి మధ్య దూరాన్ని ఏడు కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది. ఏ-380, బీ-777, బీ-747 సహా వైడ్-బాడీ విమానాలు దీనిపైనుంచి రాకపోకలు సాగించవచ్చు.
ఇప్పటికే ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రోజూ 1500కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తోన్నాయి. మున్ముందు మరింత రద్దీని తట్టుకునేలా.. ప్రయాణికుల సమయం ఆదా చేసేలా సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ఈ నిర్మాణం అందుబాటులోకి వచ్చింది.
Dosa Sambar : దోసెలోకి సాంబార్ ఇవ్వని హోటల్‌కు జరిమానా..