Sheela Bhatt on PM Modi: ఎంఏ చదువుతుండగా మోదీని కలిశానన్న జర్నలిస్ట్.. మరోసారి చర్చలో మోదీ డిగ్రీ

మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక సందర్భంలో తాను పెద్దగా చదువుకోలేదని, కేవలం 10 వరకు మాత్రమే చదివానని మోదీ అన్నారు. అనంతరం, మోదీ మాస్టర్స్ చేశారని అమిత్ షా ఒక సందర్భంలో సర్టిఫికెట్ చూపించారు.

Sheela Bhatt on PM Modi: ఎంఏ చదువుతుండగా మోదీని కలిశానన్న జర్నలిస్ట్.. మరోసారి చర్చలో మోదీ డిగ్రీ

Updated On : July 14, 2023 / 5:46 PM IST

Sheela Bhatt on Modi Degree: ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హత అంశం దేశంలోని హాట్ టాపిక్సులో ఒకటి. దీని చుట్టూ పెద్ద పెద్ద రాజకీయ చర్చలే జరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్లలో కూడా మోదీ విద్యార్హత మీద చర్చలు జరిగాయి. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనలేం. ప్రతి రోజు ఎవరో ఒకరు, ఏదో సందర్భంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తావిస్తూనే ఉంటారు. కాగా, తాజాగా సీనియర్ జర్నలిస్ట్ షీలా భట్ ఈ ప్రస్తావనను మరోసారి చర్చనీయాంశం చేశారు.

Sukesh Chandrasekhar : గవర్నర్ కు సుఖేశ్ చంద్రశేఖర్ ఫిర్యాదు లేఖ.. కేటీఆర్, కవితపై సంచలన ఆరోపణలు

1981లో మోదీ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు తాను మొదటిసారి ఆయనను కలిశానని అన్నారు. మోదీ విద్యార్హత మీద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తడాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా న్యూస్ ఏజెన్స్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “1981లో ఎంకే పార్ట్ 2 చేస్తున్నప్పుడు నేను మోదీని మొదటిసారి కలిశాను. అతని మెంటర్ ప్రొఫెసర్ ప్రవీణ్ షేత్. ఆయన నాకు కూడా గురువే. ఆ సమయంలో మోదీ బాగా చదువుతుండే వారు. ఆయన చాలా అధ్యయనశీలి” అని అన్నారు.

Moldova: ఎయిర్‭పోర్ట్‭లో కాల్పుల్లో ఇద్దరి మరణం అనంతరం రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు

ఇంకా ఆమె స్పందిస్తూ.. “ఆయన (మోదీ) క్లాస్‌మేట్‌లలో ఒకరు ఇప్పుడు లాయర్‌గా ఉన్నారు. కొంతకాలం క్రితం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్‌లు ప్రధాని మోదీని నిరక్షరాస్యుడంటూ ట్విట్టర్‌లో చాలా పోస్ట్‌లు పెడుతూంటే నేను ఆమెకు ఫోన్ చేశాను. అయితే ఈ ప్రచారంపై ఆమెను మాట్లాడమని నేను అడిగాను. కానీ ఆమె ఎందుకో నిశ్శబ్దంగా ఉండిపోయింది’’ అని షీలా అన్నారు.

Modi and Marcon: ప్రపంచానికి భారత్ పెద్దన్న.. మోదీని కౌగిళించుకుని ప్రశంసలు కురిపించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

జర్నలిస్ట్ షీలా ఈ వ్యాఖ్యలు చేయగానే నెట్టింట్లో చర్చ మొదలైంది. మోదీ అనుకూలురేమో.. ‘ఇప్పటికైనా నమ్ముతారా?’ అంటూ మోదీ డిగ్రీకి షీలా వ్యాఖ్యల్ని సాక్షం చూపిస్తుండగా.. ప్రత్యర్థులేమో విమర్శలు గుప్పిస్తూ జోక్స్, మీమ్స్ వేస్తున్నారు. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక సందర్భంలో తాను పెద్దగా చదువుకోలేదని, కేవలం 10 వరకు మాత్రమే చదివానని మోదీ అన్నారు. అనంతరం, మోదీ మాస్టర్స్ చేశారని అమిత్ షా ఒక సందర్భంలో సర్టిఫికెట్ చూపించారు.

Supreme Court..AP govt : ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు నిషేధం..

దీంతో ఆయన డిగ్రీ అంశం తరుచూ చర్చల్లోకి వస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ గతంలో ఈ విషయాన్ని పదేపదే లేవనెత్తారు. ప్రధాని విద్యార్హతలపై వివరాలను కోరారు. “గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు ప్రజల మదిలో చాలా ప్రశ్నలను లేవనెత్తాయి. పీఎం డిగ్రీలు పూర్తిగా నకిలీవని వారు ఇప్పుడు ఊహాగానాలకు శ్రీకారం చుట్టారు’’ అని ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) 2016లో ప్రధాని మోదీ ఎంఏ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని అందించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశించడాన్ని కోర్టు కొట్టివేసిన తర్వాత కేజ్రీవాల్ అన్నారు.