Modi and Marcon: ప్రపంచానికి భారత్ పెద్దన్న.. మోదీని కౌగిళించుకుని ప్రశంసలు కురిపించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు.

Modi and Marcon: ప్రపంచానికి భారత్ పెద్దన్న.. మోదీని కౌగిళించుకుని ప్రశంసలు కురిపించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

Updated On : July 14, 2023 / 5:39 PM IST

Modi France Tour: ప్రపంచ చరిత్రలో భారత్ దిగ్గజమని, ప్రపంచానికి పెద్దన్న అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రెంచ్ పర్యటన సందర్భంగా.. శుక్రవారం మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఇమ్మాన్యూయేల్. అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫొటోలను అందించారు. అనంతరం ఆయన స్పందిస్తూ భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, స్నేహదేశం అని మాక్రాన్ అన్నారు.

Chandrayaan-3: భారతీయుల ఆశల్ని నింగిలోకి మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్.. చంద్రయాన్-3 సక్సెస్!

“ప్రపంచ చరిత్రలో భారత్ ఒక దిగ్గజం. భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్న దేశం. మాకు వ్యూహాత్మక భాగస్వామి, మిత్ర దేశం” అని తను ఇచ్చిన ఫొటోలపై మాక్రాన్ రాశారు. అనంతరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ఈ సంవత్సరం 14వ జూలై పరేడ్‌కు భారతదేశాన్ని గౌరవ అతిథిగా స్వాగతించడం మాకు చాలా సంతోషకరం” అని అన్నారు. మోదీ ఎదురుపడగానే ఆప్యాయంగా కౌగిళించుకుని స్వాగతం పలికారు.

Nara Lokesh: మంగళగిరి కోర్టుకు నారా లోకేశ్.. అందరి సంగతి తేలుస్తా.. వైసీపీ నేతలకు వార్నింగ్

ఈరోజు సాయంత్రం ఫ్రాన్స్ సెనేట్ అధ్యక్షుడు గెరాడ్ లార్చర్‭తో మోదీ భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 11 గంటలకు ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఎలీసీ ప్యాలెస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయేల్ మెక్రాన్ ఏర్పాటు చేసే ప్రైవేట్ విందులో పాల్గొననున్నారు. మరోవైపు భారత నేవీ కోసం ఫ్రాన్స్‌ నుంచి 26 రాఫెళ్లు, 3 సబ్‌మెరైన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం మోదీ పర్యటన సందర్భంగా కుదిరే సూచనలున్నట్లు తెలుస్తోంది.

Sukesh Chandrasekhar : గవర్నర్ కు సుఖేశ్ చంద్రశేఖర్ ఫిర్యాదు లేఖ.. కేటీఆర్, కవితపై సంచలన ఆరోపణలు

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. తాను ఫ్రాన్స్ చేరుకున్నట్లుమోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. అక్కడ విమానాశ్రయంలో దిగుతున్న ఫొటోలు, ఆయనకు గౌరవ వందనం ఇచ్చిన ఫొటోలను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.