Delhi Liquor Scam : MLC కవిత 10 ఫోన్లలో ఏముంది? డిలీట్ అయిన డేటాను కూడా రికవరీ చేసే యత్నంలో ఈడీ

ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Scam)లో ED విచారణకు హాజరైన కవిత తన పాత ఫోన్లను ఈడీకి అందజేశారు. MLC కవిత ఈడీకి అందజేసిన 10 ఫోన్లలో ఏముంది? డిలీట్ అయిన డేటాను కూడా రికవరీ చేసేయత్నంలో ఉన్నారు ఈడీ అధికారులు.

Delhi Liquor Scam MLC Kavitha : ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) ముందు హాజరయ్యారు. విచారణకు ఆమె రావడం వరుసగా ఇది రెండోసారి. సోమవారం 10 గంటలపాటు విచారించిన ఈడీ.. మంగళవారం కూడా రావాలని కోరడంతో కవిత విచారణకు హాజరయ్యారు.

ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆమె తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. అనంతరం ఆ 10 ఫోన్లను ఉదయం 10గంటలకు ఈడీ అధికారులకు అందజేశారు కవిత. 10 మొబైళ్లను కవిత వినియోగించారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్న క్రమంలో విచారణకు ఆమె తన పాత ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. కవిత ఫోన్లలో డేటాను బట్టి ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు.దీంతో కవిత ఫోన్లలో ఏముందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఆ 10 ఫోన్లలో డేటాను ఐటీ నిపుణుల ద్వారా రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు.

Delhi Liquor Scam : ఈడీ నా ఫోన్లు ఇవ్వమనటం మహిళ స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించటమే : MLC Kavitha

జీవో ఎం ఆమెదించని లిక్ర్ పాలసీ డ్రాఫ్ట్ కాపీ, ఈ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే నిందితులుగా ఉన్నవారితో కవిత జరిపిన చాట్స్ తో పాటు ఇప్పటికే కొంత డేటాను కవిత డిలీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ నిజంగా డిలీట్ చేసి ఉంటే ఆ డేటాను కూడా రికవరీ చేయటానికి ఈడీ అధికారులు నిపుణుల ద్వారా యత్నిస్తున్నారు. డేటాకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈడీ అధికారుల ఆరోపణల ప్రకారంగా..కవిత 2021లో మూడు ఫోన్లు, 22లో 7 ఫోన్లు మార్చారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ యావత్ భారతదేశాన్నే కుదిపేస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయనేతలు ఈ స్కామ్ లో నిందితులుగా ఉన్నారు. వారితో పాటు ఢిల్లీకి చెందిన వ్యాపావేత్తలు, సంస్థల అధినేతలు ఈ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలా ఇప్పటి వరకు ఈ స్కామ్ లో ఈడీ అధికారులు 12మందిని అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ లో 36మంది నిందితులు 170 ఫోన్లు మార్చారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయినవారి ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ 17 ఫోన్లలో ఉన్న డేటాను సేకరించారు. అలా నిందితులు ఫోన్లలో డేటా అందకుండా రూ.1.30 కోట్ల విలువైన ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చెబుతోంది.

ఈ స్కామ్ వెలుగులోకి వచ్చాకే నిందితులు ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. 2022 మే నుంచి ఆగస్టు మధ్య నిందితులు అధికారికంగా ఫోన్లు మార్చారంటోంది.ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నిందితుల ఫోన్ డేటాను సేకరించిన ఈడీ అధికారులు తాజాగా కవిత ఫోన్లలో డేటాను విశ్లేషించే పనిలో పడ్డారు. ఐటీ నిపుణుల ద్వారా కవిత నుంచి స్వాధీనం చేసుకున్న 10 ఫోన్లలోని డేటాతో పాటు డిలీట్ అయినట్లుగా భావిస్తున్న డేటాను కూడా రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ డేటా రికవరీ అయితే మరింత సమాచారం ఈడీ అధికారులకు దక్కుతుంది. దీంతో ఈ కేసు పరిష్కారం కావటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Srinivas Goud: లక్షల కోట్లు దోచుకున్న వారిని వదిలేసి ఆడబిడ్డను వేధిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

10 ఫోన్లను జమ చేస్తున్నా: ఈడీ అధికారికి కవిత లేఖ
తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని కవిత తెలిపారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేంద్రకు ఆమె లేఖ రాశారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఐఎంఈఐ నంబర్లతో సహా జమ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్‌ ఫోన్లను కోరారని.. అయినా తాను ఉపయోగించిన అన్ని ఫోన్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తునకు సంబంధించిన వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు.







                                    

ట్రెండింగ్ వార్తలు