Delhi Unlock : లాక్ డౌన్ సడలింపులు..మెట్రోకు గ్రీన్ సిగ్నల్

నిబంధనలు సడలించాలని 2021, జూన్ 05వ తేదీ శనివారం నిర్ణయం తీసుకున్నారు. సరి, బేసి విధానంలో షాపులు, మాల్స్ కు అనుమతినివ్వనున్నారు. 50 శాతం ప్రయాణీకులతో మెట్రో నడపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Delhi CM Kejriwal : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో గతంలో వేల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు..ఇప్పుడు రెండంకెల సంఖ్యకు చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ ను ప్రభుత్వం పలు దఫాలుగా పెంచుకుంటూ వెళ్లింది. 2021, జూన్ 07వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ విషయంలో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

నిబంధనలు సడలించాలని 2021, జూన్ 05వ తేదీ శనివారం నిర్ణయం తీసుకున్నారు. సరి, బేసి విధానంలో షాపులు, మాల్స్ కు అనుమతినివ్వనున్నారు. 50 శాతం ప్రయాణీకులతో  మెట్రో నడపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

Read More : Vaccination In India : వ్యాక్సిన్ వేయటంలో అమెరికాను దాటేసిన భారత్

 

ట్రెండింగ్ వార్తలు