Vaccination In India : వ్యాక్సిన్ వేయటంలో అమెరికాను దాటేసిన భారత్

వ్యాక్సిన్ వేయటంతో భారత్ అమెరికాను దాటేసిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు. తొలి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేయటంతో అమెరికా కంటే భారతే ముందుందని తెలిపారు. ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా భారత్ ముందుందని అన్నారు. ఇప్పటికే 17.2 కోట్ల మందికి ఫస్ట్ డోస్ వేశామన్న కేంద్రం వెల్లడించింది.

Vaccination In India : వ్యాక్సిన్ వేయటంలో అమెరికాను దాటేసిన భారత్

Vaccination In India

Vaccination In India : భారత్ లో కరోనా ఎంత వేగంగా విస్తరించిందో అంతేస్థాయిలో మరణాలు కూడా నమోదయ్యాయి. కానీ వ్యాక్సిన్ వేయటంతో కూడా భారత్ ముందే ఉంది. వ్యాక్సిన్ వేయటంతో భారత్ అమెరికాను దాటేసిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు. తొలి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను అమలు చేయటంతో అమెరికా కంటే భారతే ముందుందని తెలిపారు. ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా భారత్ ముందుందని అన్నారు. ఇప్పటికే 17.2 కోట్ల మందికి ఫస్ట్ డోస్ వేశామన్న కేంద్రం వెల్లడించింది. మరింత మందికి వేయాలంటే సమయం పడుడుతుందని వెల్లడించింది.

కాగా రెండు డోసులు పూర్తి చేసిన విషయంలో కాకుండా ఫస్ట్ డోస్ తీసుకున్న వారి విషయంలో భారత్ ఈ ఘనత సాధించింది. ఎక్కువ మందికి మొదటి డోసు వేసిన దేశంగా రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా 17.2 కోట్ల మంది కరోనా టీకా ఫస్ట్ డోసు తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంలో అమెరికాను దాటామన్నారు. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టింది కదా అని.. జనవరి, ఫిబ్రవరిల్లో చూపించిన నిర్లక్ష్యాన్నే ఇప్పుడూ ప్రదర్శిస్తే మహమ్మారి మళ్లీ ముంచుకొస్తుందని హెచ్చరించారు. ఇప్పటి వరకూ భారత్ లో 22.78 కోట్ల డోలసులు కరోనా టీకాలు అందుబాటులో ఉండగా..నిన్న ఒక్కరోజే భారత్ లో 36,50,080 మందికి కరోనా టీకాలు వేశామని వెల్లడించారు.

Corona Update: నెలరోజుల తర్వాత కేసులు తగ్గాయి.. మరణాలు మాత్రం తగ్గట్లేదు
శంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోండగా.. మరణాలు మాత్రం తగ్గట్లేదు. గతనెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్‌ కేసులు ఇప్పుడు లక్షా 20వేలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 3380 మంది చనిపోయారు.కాగా..భారత్ లో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. కానీ మరణాలు మాత్రం తగ్గట్లేదు. గతనెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్‌ కేసులు ఇప్పుడు లక్షా 20వేలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 3380 మంది చనిపోయారు. కరోనా ఇన్‌ఫెక్షన్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, ఏప్రిల్ 6వ తేదీ తర్వత.. సరిగ్గా నెల తర్వాత కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.

అయితే, వరుసగా 23వ రోజు, దేశంలో కొత్త కరోనా వైరస్ కేసుల కంటే ఎక్కువ రికవరీలు నమోదయ్యాయి. జూన్ 4వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 22కోట్ల 78 లక్షల 60 వేల మోతాదుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడింది. చివరి రోజున 36 లక్షల 50వేల టీకాలు ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటివరకు మొత్తం 36 కోట్ల కరోనా పరీక్షలు జరిగాయి. చివరి రోజున 20 లక్షల కరోనా నమూనా పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ రేటు 6 శాతానికి పైగా ఉంది. దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతం కాగా, రికవరీ రేటు 93 శాతానికి మించిపోయింది. యాక్టివ్ కేసులు 6 శాతం కన్నా తక్కువకు వచ్చాయి. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొత్తం కరోనా సోకినవారి సంఖ్య ప్రకారం భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అమెరికా తరువాత ప్రపంచంలో, భారతదేశంలో అత్యధిక మరణాలు బ్రెజిల్‌లో నమోదయ్యాయి.