Kailash Gahlot : ఆప్‌కు ఎదురుదెబ్బ.. ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లాట్ రాజీనామా.. లేఖలో పార్టీపై ఆరోపణలు!

Kailash Gahlot : ఆమ్ ఆద్మీ పార్టీ సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ప్రజల హక్కులకై పోరాడటంలో ఆప్ విఫలమైందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.

Delhi Minister Kailash Gahlot resigns from AAP

Kailash Gahlot : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లాట్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు. కైలాష్ గహ్లాట్ రాజీనామా నేపథ్యంలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆప్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ప్రజల హక్కులకై పోరాడటంలో ఆప్ విఫలమైందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. సొంత ఎజెండా అంటూ ఆప్ పాకులాడుతోందని చెప్పారు. యమునా నది స్వచ్ఛంగా మారుస్తామని హామీ ఇచ్చి అధ్వాన్నంగా మారిందని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు. హామీలను నెరవేర్చాలనే విషయాన్ని ఆప్ విస్మరించిందని గహ్లాట్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

కైలాష్ గహ్లాట్ రాజీనామాపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందిస్తూ బీజేపీ కుట్ర రాజకీయలు చేస్తోందని మండిపడ్డారు. గహ్లాట్‌ను పార్టీని విడిచిపెట్టమని ఒత్తిడి చేస్తూ బీజేపీ నీచ రాజకీయాలతో కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘బీజీపీ కుట్ర, నీచ రాజకీయాలలో విజయం సాధించింది.

బీజేపీ ఒత్తిడికి గురై, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించిన గహ్లాట్‌ను సీబీఐ, ఈడీ సహా కేంద్ర ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకున్నాయి’’ అని సింగ్ పేర్కొన్నారు. రాజీనామా లేఖలో గహ్లోట్ చేసిన ఆరోపణలకు సంబంధించి సింగ్ సమాధానాలిచ్చారు. “5 ఏళ్లు ప్రభుత్వంలో భాగంగా ఉన్నందున ఆయన అలాంటి ఆరోపణలు చేయలేడు. బీజేపీ గహ్లోట్‌కు స్క్రిప్ట్‌ను ఇచ్చిందని, దానికి అనుగుణంగానే మాట్లాడుతున్నారంటూ సింగ్ మండిపడ్డారు.

గహ్లాట్ నిర్ణయంపై బీజేపీ ప్రశంసలు :
మరోవైపు.. గహ్లాట్ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. రాజీనామా నిర్ణయాన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించింది. ఢిల్లీ బీజీపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఆప్ నాయకత్వాన్ని బహిర్గతం చేసినందుకు గహ్లోట్‌ను అభినందించారు. “కైలాష్ గహ్లోట్ అరవింద్ కేజ్రీవాల్‌కు అద్దం చూపించి తన ‘లూటీరా గ్యాంగ్‌’కి దూరంగా ఉన్నాడు. ఆయన నిర్ణయం ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. గహ్లాట్ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం ”అని సచ్‌దేవా అన్నారు. ఆప్ పాలనపై గహ్లోట్ చేసిన విమర్శలను బీజేపీ నేత నలిన్ కోహ్లి ఎత్తిచూపారు.

Read Also : Allu Arjun – Rashmika : రష్మిక కాలు పట్టుకొని.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. పుష్ప 2 ట్రైలర్ లో ఈ షాట్ గమనించారా?