Allu Arjun – Rashmika : రష్మిక కాలు పట్టుకొని.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. పుష్ప 2 ట్రైలర్ లో ఈ షాట్ గమనించారా?
ట్రైలర్ లో చాలా మాస్ షాట్స్ తో పాటు రష్మికతో క్యూట్ సీన్స్ లోని షాట్స్ కూడా ఉన్నాయి.

Allu Arjun Rashmika Scene goes Viral from Pushpa 2 Trailer
Allu Arjun – Rashmika : అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నేడు రిలీజయింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా బీహార్ పాట్నాలో నిర్వహించారు. ఆల్మోస్ట్ లక్షమంది జనాభా మధ్య ట్రైలర్ ను అల్లు అర్జున్ లాంచ్ చేసారు. ప్రస్తుతం ట్రైలర్ ట్రెండ్ అవుతుంది. ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమా ఇంకో రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.
Also Read : Pushpa 2 Trailer : అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్..
ట్రైలర్ లో చాలా మాస్ షాట్స్ తో పాటు రష్మికతో క్యూట్ సీన్స్ లోని షాట్స్ కూడా ఉన్నాయి. అయితే ఓ షాట్ లో రష్మిక కాలుతో అల్లు అర్జున్ తన గడ్డం దగ్గర తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజం చేయడం చూపించారు. దీంతో ఇది వైరల్ గా మారింది. స్టార్ హీరో హీరోయిన్ కాలు పట్టుకోవడం ఒక ఎత్తైతే, ఇలా తన మేనరిజంను హీరోయిన్ కాలితో చేయడం మరో ఎత్తు అంటూ బన్నీని పొగుడుతున్నారు. ఇలాంటి థాట్ వచ్చినందుకు సుకుమార్ ని కూడా పొగుడుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి షాట్స్, సీన్స్ సినిమాలో ఇంకా ఎన్ని ఉన్నాయో చూడాలి మరి.
పుష్ప 2 ట్రైలర్ చూసేయండి..