Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 7,498 కొవిడ్ కేసులు.. 28 మరణాలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం (జనవరి 26) కొత్తగా 7,498 కొత్త కేసులు నమోదు కాగా.. 29 మరణాలు నమోదయ్యాయి.

Delhi Covid-19 Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం (జనవరి 26) కొత్తగా 7,498 కొత్త కేసులు నమోదయ్యాయి. 29 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం కరోనా కేసుల (6,028) కన్నా 24 శాతం పెరిగాయి. కరోనా పాజిటివిటీ రేటు 10.59 శాతంగా నమోదైంది. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 38,315కు చేరింది.

ఒక రోజులో 11,164 మంది బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రుల్లో 15 శాతం కన్నా తక్కువ పడకలు ఉన్నాయని హెల్త్ బులెటిన్ పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో 28,733 మంది బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. గత 24 గంటల్లో, 70,804మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటిలో 56,737 RT-PCR పరీక్షలు కాగా, 14,067 యాంటిజెన్ పరీక్షలను నిర్వహించారు.

ఢిల్లీ నగరంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో ఢిల్లీలో ఆంక్షలను తొలగించే అవకాశం కనిపిస్తోంది. జనవరి 13న, ఢిల్లీలో 28,867 కేసుల్లో రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. రెండు రోజుల తర్వాత నగరంలో 30.5 శాతం పాజిటివిటీ రేటును నమోదు చేసింది. మూడవ వేవ్ మధ్య అత్యధికంగా నమోదైంది. దేశ రాజధానిలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూలను ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం గత వారమే సిఫార్సు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆమోదానికి ఫైల్‌ను ఆయన కార్యాలయానికి పంపగా తిరస్కరించారు.

ఢిల్లీలో, 100శాతం మంది ప్రజలు కరోనా మొదటి డోస్ తీసుకున్నారు. 82శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లను పొందారని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో ప్రస్తుతం 38,315 యాక్టీవ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 1,81,09,97 కరోనా కేసులు నమోదు కాగా.. 25,710 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కట్టడికి ఢిల్లీ వ్యాప్తంగా 43,662 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.

Read Also : Drone Fall : రిపబ్లిక్ డే వేడుక‌ల్లో డ్రోన్ కలకలం.. ఇద్ద‌రికి గాయాలు

ట్రెండింగ్ వార్తలు