Drone Fall : రిపబ్లిక్ డే వేడుక‌ల్లో డ్రోన్ కలకలం.. ఇద్ద‌రికి గాయాలు

రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్‌లో బుధవారం సంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేశారు.

Drone Fall : రిపబ్లిక్ డే వేడుక‌ల్లో డ్రోన్ కలకలం.. ఇద్ద‌రికి గాయాలు

Two injured as drone falls on them during Republic Day event in MP's Jabalpur

Drone Falls Down : భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్రోన్ కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్‌లో బుధవారం సంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో జానపద కళకారులు నృత్యం చేస్తుండగా గాల్లో ఎగిరే డ్రోన్ ఒక్కసారిగా వారిపై పడింది.

డ్రోన్ మీదపడటంతో ఇద్దరి కళాకారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. పండిట్ రవి శంకర్ శుక్లా స్టేడియంలో (Pandit Ravi Shankar Shukla stadium)లో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. Indu Kunjam (38) Gangotri Kunjam (18) అనే గిరిజన కళాకారులు ఇద్దరు గాయపడినట్టు తెలిపారు.


వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని అదనపు సూపరిటెండెంట్ పోలీసు Rohit Kashwani తెలిపారు. ఆ ఇద్దరు క్షతగాత్రులూ దినోదరి జిల్లాలోని జబల్ పూర్ ప్రాంతానికి చెందినవారిగా పేర్కొన్నారు, డ్రోన్ కెమెరాలతో సంప్రదాయ దృశ్యాల‌ను రికార్డు చేస్తుండగా డ్రోన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో డ్రోన్ క‌ళాకారుడికి గాయాల‌య్యాయి. పోలీసులు వెంట‌నే ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Read Also : Sundar Pichai : గూగుల్​ సీఈఓ​పై కాపీరైట్​ ఉల్లంఘన కేసు..!