Delhi Police : వృత్తిని, అభిరుచుల్ని సమానంగా ప్రేమించాలంటున్న ఢిల్లీ పోలీసులు.. సమయం దొరికితే వాళ్లేం చేస్తున్నారంటే?

ఢిల్లీ పోలీసులు ఓ వైపు విదులు నిర్వర్తిస్తూనే.. తమ అభిరుచులపై దృష్టి పెడతారు. సమయం దొరికితే అద్భుతమైన సినిమా పాటలు పాడుతూ ఉంటారు. మన అభిరుచుల్ని.. మన వృత్తిని రెండిటీని సమానంగా ప్రేమించాలని చెబుతున్నారు.

Delhi Police :  మన ఇష్టాల్ని ప్రేమించడంతో పాటు చేసే పనిని ప్రేమించాలి.. ఇలా చెబుతున్నది ఎవరో కాదు ఢిల్లీ పోలీసులు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు టైం దొరికితే అద్భుతమైన పాటలు పాడేస్తున్నారు. రీసెంట్‌గా కొందరు పోలీసులు పాట పాడిన వీడియో వైరల్ అవుతోంది.

Delhi Police : 24 ఏళ్ల క్రితం చనిపోయిన నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

సోషల్ మీడియాలో తరచుగా అద్భుతమైన పాటలు పాడే వారి వీడియోలు సెర్చ్ చేశారనుకోండి.. ఖచ్చితంగా మీకు ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్‌లో పనిచేస్తున్న రజత్ రాథోర్ వీడియోలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన పాడటమే కాదు వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటారు.

 

రీసెంట్‌గా రాథోర్ తన పోలీస్ మిత్రులు సంగీత సహకారం అందిస్తుంటే ‘తూ జానే నా’.. అనే పాటను పాడి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ సినిమాలో కత్రీనా కైఫ్, రణబీర్ కపూర్‌ల మధ్య సాగే పాట ఇది. ఈ పాట పాడుతున్నప్పుడు రాథోర్ అద్భుతంగా గిటార్ వాయించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐర్లాండ్ నుంచి వచ్చిన ఫోన్..ఢిల్లీ యువకుడ్ని కాపాడిన ముంబై పోలీసులు

వీడియో చూసిన వారంతా ‘మీ ప్రతిభ అమోఘం’ అని కొందరు.. ‘అందమైన వాయిస్’ అని మరికొందరు రాథోర్‌కి కితాబు ఇచ్చారు. పోలీసు వృత్తి అంటేనే కాస్త కూడా సమయం దొరకదు. అలాంటిది దొరికిన సమయాన్ని ఇలా తమ అభిరుచులపై మళ్లించడం అంటే గ్రేట్ కదా. రాథోర్ ఆయనతో పాటు ఉన్న పోలీసులంతా టైం మేనేజ్మెంట్‌తో ఇలా ముందుకి సాగుతున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు