Delhi Police : 24 ఏళ్ల క్రితం చనిపోయిన నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

24 ఏళ్ల క్రితం చనిపోయిన నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేసారు ఢిల్లీ పోలీసులు.

Delhi Police : 24 ఏళ్ల క్రితం చనిపోయిన నిందితుడిని ఇప్పుడు అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

Delhi Police arrests a man who ‘died’ 24 years ago

Delhi Police arrests a man who ‘died’ 24 years ago : 24 ఏళ్ల క్రితం చనిపోయిన నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు..అదేంటో చనిపోయిన వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు?అదీకూడా 24 ఏళ్ల క్రితం చనిపోతే అనే డౌటనుమానం వచ్చి తీరుతుంది. కానీ ఇక్కడే ఉంది అసలు కిటుకు..ఆ నిందితుడికి అమోఘమైన తెలివితేటలూను..వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే అనేలా ఉందీ ప్లాన్..కానీ తాడిని తన్నేవాడుంటే దాని తల తన్నేవాడుంటుడని పోలీసులు అంతకంటే ఘనులు..అందుకు 24 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు..!!

1991లో ఓ దొంగతనం జరిగింది. ఈ కేసులో ఓ వ్యక్తి నిందితుడుగా ఉన్నారు. అతడిని పట్టుకోవటానికి పోలీసులు నానా తిప్పలు పడ్డారు. కానీ దొరకలేదు. ఎందుకంటే అతను చనిపోయాడు కాబట్టి..కాదు కాదు చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి పోలీసులకు టోకరా ఇచ్చాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రికార్డులను పక్కాగా పరిశీలించిన పోలీసులు అతను చనిపోయాడని ధృవీకరించిన పోలీసులు ఆకేసును క్లోజ్ చేసేశారు. కాలానుగుణంగా ఆ కేసు పాత రికార్డుల్లో కలిసిపోయింది. అదే విషయాన్ని 1998లో కోర్టుకు తెలిపారు. పోలీసుల వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును పెండింగ్‌లో పెట్టేసింది.

అలా 24 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సదరు నిందితుడు ఇక తన గురించి పోలీసులుమర్చిపోయారని ధీమాగా అజ్ఞాతం వీడి బయటకొచ్చాడు. ఈ సమాచారం బవానా పోలీసులకు అందింది. వారు షాక్ అయ్యారు. సదరు నిందితుడు చనిపోలేదు బతికే ఉన్నాడని పక్కా సమచారాంతో పక్కా ప్లాన్ తో అరెస్టు చేశారు. గత 24 సంవత్సరాలుగా అతడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నకిలీ పత్రాలు తయారు చేసిన వ్యక్తి గురించి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నార్త్ అవుట్ డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా మాట్లాడుతూ..ఫేక్ ఐడీలతో చనిపోయాడని నమ్మించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని విచారిస్తున్నామని తెలిపారు.