Delhi Police: హెరాయిన్ తరలిస్తూ పట్టుబడ్డ 49ఏళ్ల మహిళ

వెస్ట్ ఢిల్లీలో 23గ్రాముల హెరాయిన్ తరలిస్తున్న 49ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ 23గ్రాముల హెరాయిన్ విలువ రూ.20లక్షల వరకూ ఉండొచ్చని పోలీసులు..

Delhi Police: హెరాయిన్ తరలిస్తూ పట్టుబడ్డ 49ఏళ్ల మహిళ

Arrest

Updated On : March 20, 2022 / 8:30 PM IST

Delhi Police: వెస్ట్ ఢిల్లీలో 23గ్రాముల హెరాయిన్ తరలిస్తున్న 49ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ 23గ్రాముల హెరాయిన్ విలువ రూ.20లక్షల వరకూ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితురాలిని సురేఖగా గుర్తిస్తూ.. ఆమెపై గతంలో 27కేసులు ఉన్నాయని గమనించారు.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‍‌స్టాన్సెస్ చట్టం కింద రెండు కేసులు ఉన్నాయి.

ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో శనివారం పాట్రోలింగ్ నిర్వహిస్తున్న డీసీపీ శంకర్ చౌదరీ మరో ఇద్దరి పోలీసులకు అనుమానస్పదంగా మహిళ కనిపించింది. కాలీ బస్తీలోని శంషాన్ ఘాట్ వద్ద మహిళ వద్దకు వెళ్తుండగా పారిపోవాలని ప్రయత్నించింది. వెంబడించి ఎట్టకేలకు పట్టుకుని సోదా చేయగా హెరాయిన్ దొరికింది.

Read Also : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

ఎన్డీపీఎస్ సెక్షన్ 21 ప్రకారం.. కేస్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు అధికారులు.