Drugs Gang : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

నైజీరియన్‌తో పాటు.. మూడు ముఠాలు అరెస్టయ్యాయి. డ్రగ్స్‌ విక్రయిస్తున్న 12 మందిని.. డ్రగ్స్‌ సేవిస్తున్న మరో 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Drugs Gang : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

Drugs

drug gang arrest : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడుతున్న కేటుగాళ్లను నార్కోటిక్‌ వింగ్‌ అరెస్ట్‌ చేసింది. నైజీరియన్‌తో పాటు.. మూడు ముఠాలు అరెస్టయ్యాయి. డ్రగ్స్‌ విక్రయిస్తున్న 12 మందిని.. డ్రగ్స్‌ సేవిస్తున్న మరో 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  పరారీలో ఉన్న మరో 13 మంది కోసం గాలిస్తున్నారు. MDMA, LASDతో పాటు.. హాష్‌ఆయిల్‌, గంజాయి సీజ్‌ చేశారు. SR నగర్‌, కార్కానా, సికింద్రాబాద్‌లో మత్తు విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు హైదరాబాద్ డ్రగ్స్ కేసును పోలీసులు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ వినియోగదారులపై చర్యలకు సిద్ధపడుతున్నారు. సెక్షన్ 27 ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు… డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో 30 మంది ప్రముఖులను గుర్తించారు. ఈ జాబితాలో అన్ని రంగాల ప్రముఖులు, వారి పిల్లలు ఉన్నారు.

Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. ఈడీకి కాల్ రికార్డింగ్స్‌ ఇవ్వని ఎక్సైజ్‌ శాఖ

ఇక వారంతా చాలా కాలంగా డ్రగ్స్ వాడుతున్నట్లుగా గుర్తించారు. ఇటీవల ముంబైకు చెందిన డ్రగ్స్ ముఠాలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. ముంబై నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాలకు నైజీరియన్స్, జ్యూడ్, టోనీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది.

హైదరాబాద్ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. టోనీ వాట్సాప్‌లో మరికొంత మంది వ్యాపారవేత్తల కాంటాక్టులు బయటపడ్డాయి. హైదరాబాద్‌తో పాటు పుణె, ముంబైకి చెందిన బడా వ్యాపారవేత్తలు బాగోతం బట్టబయలైంది. అంతేకాకుండా హైదరాబాద్‌కు చెందిన కొంతమంది వ్యాపారస్తులు రెండేళ్లుగా టోనీ నుంచి కొకైన్‌ను తెప్పించుకున్నట్లు తేలింది. ఇక అరెస్ట్ అయిన ఏడుగురు వ్యాపారవేత్తలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.