దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. మూడు రోజులుగా ఎలాంటి విధ్వంసం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా కాలిపోయిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. భారీగా ఇటుకలు, రాళ్లు, కూల్ డ్రింక్ సీసాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లర్లు అదుపులోకి వచ్చాయి.
ఈశాన్య ఢిల్లీలో కర్ఫ్యూ విధించడంతోపాటు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేయడంతో.. అల్లర్లు, ఆందోళనలు తగ్గాయి. దీంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు చేపట్టారు. ఆందోళనల్లో నడిరోడ్లపై ఆహుతైన వాటిని తొలగిస్తున్నారు. మరోవైపు.. ఈ అల్లర్ల మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఒకేరోజు 8మంది మృతిచెందడంతో మృతులసంఖ్య 35కి చేరింది. చెదురుమదురు ఘటనలు మినహా పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలు, షాపులు మూసివేశారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 106 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు,18 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
* సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీ అట్టుడికింది.
* హింసాత్మక ఘటనలో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోయారు.
* ఈ అల్లర్లతో విద్యార్ధులు స్కూల్ కు వెళ్లాలంటే హఢలిపోయారు.
* విద్యార్ధులు సురక్షితంగా స్కూల్స్ కు వెళ్లాలనే మంచి మనస్సుతో ఢిల్లీలోని యమునా విహాన్ వాసులు మానవ హారంగా నిలబడ్డారు.
* ఢిల్లీ అల్లర్లను నివారించడంలో పోలీసుల వైఫల్యం, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్‌పై బదిలీ వేటు పడింది.
* ఢిల్లీ హైకోర్టు నుంచి మురళీధర్ ఆకస్మిక బదిలీ అయ్యారు.
* ఢిల్లీ అల్లర్ల కేసు విచారణ సాగు తున్న దశలో బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది.
* ఈశాన్య ఢిల్లీలో అనుకూల, సిఎఎ వ్యతిరేక నిరసనకారుల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో గాయపడ్డారు.
* ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కుటుంబసభ్యులకు కోటి * రూపాయలతో పాటు, రతన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది.
* ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూర్టీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువకుడు అంకిత్ శర్మను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు.
* బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ, అభయ్ వర్మలపై ఎఫ్ఐఆర్‌లను నమోదు చెయ్యాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read More >>విశాఖలో టెన్షన్ : బాబు కాన్వాయ్‌పై చెప్పులు