Delhi blast
Delhi blast : దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు సంచలనం సృష్టించింది. నవంబర్ 10వ తేదీ సాయంత్రం 6.50 గంటల సమయంలో జరిగిన కారు పేలుడులో సుమారు 10 మంది చనిపోయారరు. 26 మందికి పైగా గాయాలయ్యాయి. ఘటన తర్వాత అక్కడ మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కారు పేలుడు ధాటికి మరో నాలుగు కార్లకు మంటలు అంటుకుని తగలబడ్డాయి. అయితే, దీనికి సంబంధించి ఇది సూసైడ్ ఎటాక్ అని భావిస్తున్నారు. పేలుడు జరిగిన కారు i20. ఇది R26CE7674 కారు నెంబర్ కలిగి ఉంది. దీనికి సంబంధించి బాదర్ పూర్ బోర్డ్ వద్ద కారు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. అందులో డ్రైవర్ బ్లూ టీ షర్ట్ వేసుకున్నట్టు కనిపిస్తోంది.
రెడ్ ఫోర్ట్ వద్ద ‘ఆత్మాహుతి దాడి’ జరగడం అంటే..
రెడ్ ఫోర్ట్ అనేది దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. రిపబ్లిక్ డే, స్వాంతంత్ర్య దినోత్సవాల్లో అక్కడే త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. అలాంటి చోట ఆత్మాహుతి దాడి జరగడం అంటే దేశ సార్వభౌమత్వంపై దాడిగా చూడాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫరీదాబాద్ లోని ఓ డాక్టర్ ఇంట్లో 2900 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్న రోజే ఇలా జరగడం ఇది కచ్చితంగా ఉగ్రదాడి అనే విషయం కచ్చితంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ పేలుడుకి బాధ్యత వహించలేదు. తామే చేశామని చెప్పలేదు. మరోవైపు ముర్షిదాబాద్ వద్ద 150 కేజీల పేలుడు పదార్థాలను పట్టుకోవడం చూస్తుంటే మరో పెద్ద ప్రమాదం తప్పినట్టే అనుకోవచ్చు.
వైట్ కాలర్ టెర్రరిజం..
గతంలో చదువులేని యువతను ఉగ్రవాదులుగా మార్చి ఇండియాలో దాడులు చేయడానికి పాకిస్తాన్ పన్నాగం పన్నేది. అయితే, ఈ సారి బాగా చదువుకున్న వారు, ఏకంగా డాక్టర్లు కూడా ఈ నెట్ వర్క్ లో దొరకడం సంచలనంగా మారింది. జిహాద్ వైపు చదువుకున్న యువత మళ్లడం ఫ్యూచర్ లో తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుంది. టెక్ శావీ టెర్రరిస్టులను పట్టుకోవడంలో ప్రభుత్వం, ఏజెన్సీలు డార్క్ వెబ్ మీద ఫోకస్ చేసి పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.