Corona Cases : ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. 24 గంటల్లో ఎన్ని కేసులంటే!

ఢిల్లీలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో 22,751 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 17 మంది క‌రోనాతో మృతి చెందారు.

Corona Cases : ఢిల్లీలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో 22,751 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 17 మంది క‌రోనాతో మృతి చెందారు. ఢిల్లీలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా నైట్ క‌ర్ఫ్యూను, వీకెండ్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. విద్యాసంస్థ‌ల‌ను మూసివేశారు. సినిమా హాళ్లను ఇప్ప‌టికే మూసేశారు. ప్రార్థన మందిరాలు కూడా మూతబడ్డాయి. ఇక ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను ఇచ్చేశారు.

చదవండి : Corona Cases : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 22 లక్షలకుపైగా కేసులు

సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని తెలిపాయి. తాజాగా నమోదైన కేసులతో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,733కి చేరింది. ఇక ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,63,837చేరింది. వారం ప‌దిరోజుల క్రితం వెయ్యిలోపే ఉన్న యాక్టీవ్ కేసులు, ఇప్పుడు ఒక్క‌సారిగా 60 వేల‌కు పెరిగాయి. రాష్ట్రంలో ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 23.53శాతంగా ఉన్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 10,179 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇక కరోనా బారినపడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాజాగా చేసిన పరీక్షల్లో నెగటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి కరోనా విషయం తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులను సూచించారు. ఇక పలు శాఖల అధికారులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనీ సూచించారు

చదవండి : Corona Spread : కరోనా విలయం.. ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి

 

 

ట్రెండింగ్ వార్తలు