Delhi Covid Positivity Rate : ఢిల్లీలో గత 24 గంటల్లో 3,846 కొవిడ్ కేసులు.. 6శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు

దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 3,846 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 9,427 మంది రికవరీ అయ్యారు. మరో 235 మంది కరోనాతో మరణించినట్టు ఆరోగ్య బులెటిన్ వెల్లడించింది.

Delhi Covid positivity rate : దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 3,846 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 9,427 మంది రికవరీ అయ్యారు. మరో 235 మంది కరోనాతో మరణించినట్టు ఆరోగ్య బులెటిన్ వెల్లడించింది. 24గంటల వ్యవధిలో నమోదైన రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఏప్రిల్ 5 నుంచి అతి తక్కువగా నమోదైనట్టు పేర్కొంది. బులెటిన్ ప్రకారం.. నగరంలో పాజిటివిటీ రేటు మంగళవారం 6.89శాతం నుంచి 5.78శాతానికి తగ్గిపోయింది.

దేశ రాజధానిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,06,719 చేరగా 13,39,326 మంది రికవరీ కరోనా బారినపడి 22,346 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 45,047 యాక్టివ్ కేసులు ఉన్నాయి. COVID-19 థర్డ్ వేవ్ నుంచి పిల్లలను రక్షించడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

COVID మూడవ వేవ్ వస్తే.. పోరాడటానికి తమ ప్రభుత్వం ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు. అధికారులతో జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. మూడవ వేవ్ నుండి పిల్లలను రక్షించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. చివరిసారి కంటే పడకలు, ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు