ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసివేత
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్ లోని అని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మార్చి 31వ తేదీ వరకు మూసేయాలని గురువారం(మార్చి 12,2020) ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ప్రైమరీ స్కూల్స్ కు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న స్కూళ్లు, కాలేజీలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆ విద్యా సంస్థలు తెరిచే ఉంటాయి. పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలు మాత్రం తప్పనిసరిగా మూసేయాలని సీఎం కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. అంతేకాదు అన్ని రకాల బహిరంగ సభలను రద్దు చేసుకోవాలన్నారు.
కరోనా వ్యాప్తి భయంతో జమ్మూకశ్మీర్ లోనూ ఇలానే మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు మూసేయాలని ఆదేశాలిచ్చారు. బోర్డ్, కాంపిటీటివ్ పరీక్షలకు ఇది ఏ మాత్రం ఇబ్బంది కాదని కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్(డీఐపీఆర్) తెలిపింది.
‘జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఉన్న పబ్లిక్, ప్రైవేట్ విద్యా సంస్థలు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నింటినీ 2020 మార్చి 31వరకూ మూసేయాలి. బోర్డ్ అండ్ కాంపిటీటివ్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అనవసర ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిదని’ ట్వీట్ ద్వారా వెల్లడించారు అధికారులు.
వీటితో పాటుగా మార్చి 31వరకూ 10 జిల్లాల్లోనూ అంగన్వాడీ సెంటర్లు, సినిమా హాళ్లు కూడా మూసేస్తున్నారు. బుధవారం(మార్చి 11,2020) ఓ మహిళకు కరోనా పాజిటివ్ కేసు నమోదైన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత్ లో ఇప్పటివరకు(మార్చి 12,2020) 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించింది. 100కుపైగా దేశాలు కరోనా బారిన పడ్డాయి. 4వేల మంది చనిపోయారు. లక్ష మందికిపైగా కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలో కరోనా తగ్గుముఖం పట్టినా ఇటలీ, ఇరాన్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.(మంత్రులకు కరోనా షాక్…జాగ్రత్తగా ఉండాలని మోడీ పిలుపు)