Delhi : నిర్మానుష్యంగా ఢిల్లీ…మూతపడిన షాపులు, ఇళ్లలోనే ప్రజలు

ఢిల్లీలో వీకెండ్‌ లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి.

Weekend Curfew : ఢిల్లీలో వీకెండ్‌ లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి. రోడ్డుపై బస్సులు, ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. కిరాణా, కూరగాయల వంటి అత్యవసర సేవలు మినహా ఇతర షాపులన్నీ మూతపడ్డాయి. ఢిల్లీలో రికార్డ్‌ స్థాయిలో కేసులు నమోదవుతుండడంతో కేజ్రీవాల్‌ సర్కార్‌ వీకెండ్‌ కర్ఫ్యూ విధించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. పేరుకు వీకెండ్‌ కర్ఫ్యూ అయినా….ఆంక్షలు లాక్‌డౌన్‌ను తలపిస్తున్నాయి. రోడ్లపై పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 19 వేలకు పైగా కేసులు నమోదు కాగా…కరోనాతో 141 మంది మృతి చెందారు.

వీకెండ్ కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకు వస్తే..కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లేనని, వారిని అరెస్టు చేయడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని, పాస్ లేకుండా బయటకు రావొద్దని సూచించారు. వీకెండ్ లాక్‌డౌన్ సందర్భంగా కార్యాలయాలు, రెస్టారెంట్లు, మెట్రో, మాల్స్‌, ఆడిటోరియం తదితర వాటిని మూసివేశారు. ఎక్కువగా కేసులు నమోదయ్యే ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలన్నారు.

Read More : Cuban Communist Party : ముగిసిన క్యాస్ట్రో శకం

ట్రెండింగ్ వార్తలు