Delivery Boy : ఓ డెలివరీ బాయ్ విధుల పట్ల చూపిన అంకితభావం సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారితీసింది. డ్యూటీలో ఎదురైన సవాళ్లను అధిగమించి మరీ అతడు తన విధిని నిర్వహంచడంపై చర్చ జరుగుతోంది. ఓ ఐటెమ్ ను డెలవరీ చేసేందుకు వెళ్లగా.. లిఫ్ట్ పని చేయలేదు. అయినా అతడు వెనుదిరగలేదు. 12 ఫ్లోర్లు నడుచుకుంటూ వెళ్లి మరీ ఆర్డర్ ను డెలివరీ చేశాడు.
డ్యూటీలో ఆ డెలివరీ బాయ్ చూపిన అంకితభావాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి వారిపై దయ చూపించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆర్డర్ చేసే వారు ఇలాంటి వారి పట్ల కాస్త కనికరం చూపించాలంటున్నారు. లిఫ్ట్ పని చేయడం లేదని తెలిసినా.. ఆర్డర్లు పెట్టి 12 ఫోర్లు నడిచేలా చేయడం చాలా బాధాకరం అంటున్నారు.
పెద్ద కిరాణ సామానుతో ఓ డెలివరీ బాయ్ వచ్చాడు. అయితే, ఆ బిల్డింగ్ లో లిఫ్ట్ పని చేయడం లేదు. అయినా అతడు వెనక్కి వెళ్లలేదు. కిరాణ సామాను ఆర్డర్‌ను 12 ఫ్లోర్లు నడుచుకుంటూ ఎక్కి తీసుకెళ్లాడు. కస్టమర్ ఇంటికి చేరుకునే సమయానికి అతను బాగా అలసిపోయాడు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది.
Also Read : ఈయూకు ట్రంప్ వార్నింగ్.. వీస్కీపై వెనక్కు తగ్గకుంటే.. వైన్ పై 200శాతం.. దెబ్బకు పడిపోయిన షేర్లు
తలుపు తీసి బయటకు వచ్చిన కస్టమర్.. తన ఆర్డర్ ను తీసుకున్నాడు. విధుల పట్ల డెలివరీ బాయ్ అంకితభావాన్ని అతడు ప్రశంసించాడు. లిఫ్ట్ పని చేయకపోయినా 12 ఫ్లోర్లు ఎక్కి వచ్చి మరీ తన ఆర్డర్ ఇవ్వడం పట్ల హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డెలివరీ బాయ్ కి అతడు మంచి టిప్ ఇచ్చాడు. అయితే, అతడు టిప్ తీసుకోవడానికి నిరాకరించాడు. రెండు సార్లు రిక్వెస్ట్ చేస్తే కానీ అతడు టిప్ తీసుకోలేదు.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్ కి ఆ వ్యక్తి టిప్ ఇవ్వడం గొప్ప సంగతి అని, మీరూ ఇలాంటి రివార్డులు ఇవ్వండని కొందరంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు. టిప్ ఇవ్వడం గొప్ప సంగతి కాదు.. కస్టమర్ కొన్ని మెట్లు దిగి కిందకి వచ్చి ఉంటే మరింత సాయం చేసినట్లు అయ్యేదన్నారు.
లిఫ్ట్ పని చేయడం లేదని తెలిసినా.. కిందకు దిగిరాకుండా.. డెలివరీ బాయ్ ని 12 ఫ్లోర్లు నడిపించడం దారుణం అంటున్నారు. అలా కాకుండా కస్టమర్ ముందే 6 ఫ్లోర్లు కిందకు దిగి వచ్చి తన ఆర్డర్ ను తీసుకుని ఉంటే చాలా బాగుండేదని అంటున్నారు. డెలివరీ బాయ్స్ పట్ల కొంత జాలి, దయ, మానవత్వం చూపాలని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో టిప్స్ ఇస్తే చాలదు.. కాస్త జాలి, దయ కూడా చూపించాలంటున్నారు.
అంత కష్టపడి పైకి వచ్చిన అబ్బాయిని కాసేపు కూర్చోపెట్టి, తాగడానికి మంచి నీళ్లు ఇచ్చి ఉండాల్సిందని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. టిప్స్ ఇవ్వడం, అతడిని కూర్చోబెట్టడం, నీళ్లు ఇవ్వడం.. వీటన్నింటికంటే.. కస్టమర్ 6 ఫ్లోర్లు కిందకు దిగి వచ్చి ఉంటే మరింత బాగుండేదని మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
గిగ్ వర్కర్స్ పట్ల కస్టమర్లు వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ కు దారితీసింది. టిప్ ఇవ్వడం మంచిదే.. అంతకుమించి గిగ్ వర్కర్లకు మెరుగైన జీతం అందాలి. వారికి మెరుగైన పని పరిస్థితులు కల్పించాలి. వారి పట్ల దయ చూపించాలని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.