Donald Trump: ఈయూకు ట్రంప్ వార్నింగ్.. వీస్కీపై వెనక్కు తగ్గకుంటే.. వైన్ పై 200శాతం.. దెబ్బకు పడిపోయిన షేర్లు

అధికారంలోకి వచ్చిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్ లు విధిస్తున్న విషయం తెలిసిందే..

Donald Trump: ఈయూకు ట్రంప్ వార్నింగ్.. వీస్కీపై వెనక్కు తగ్గకుంటే.. వైన్ పై 200శాతం.. దెబ్బకు పడిపోయిన షేర్లు

Donald Trump

Updated On : March 14, 2025 / 11:41 AM IST

Donald Trump: అధికారంలోకి వచ్చిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్ లు విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ దూకుడు వాణిజ్య యుద్ధానికి దారితీస్తోంది. కెనడా, మెక్సికో, చైనా, ఈయూ సహా చాలా దేశాలపై సుంకాలతో ట్రంప్ విచుకుపడుతున్నాడు. అయితే, తాజాగా యూరోపియన్ యూనియన్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా నుంచి ఎగుమతి అయ్యే విస్కీపై యూరోపియన్ యూనియన్ విధించిన టారిఫ్ లు ఎత్తేయకుంటే ఆ దేశాల నుంచి వచ్చే అన్నిరకాల వైన్లు, ఇతర అల్కహాలిక్ ఉత్పత్తులపై తాము 200శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

Also Read: Skin Like Hydrogel : వావ్.. సైంటిస్టుల అద్భుత సృష్టి.. చర్మం లాంటి హైడ్రోజల్.. 24 గంటల్లో గాయాలు పూర్తిగా నయం..!

ఈయూ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పన్నులుండే అథారిటీ. అమెరికా నుంచి లబ్ధి పొందడానికే అది ఏర్పడిందంటూ ట్రప్ వ్యాఖ్యానించారు. తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే విస్కీపై 50శాతం టారిఫ్ విధించిందని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్రూత్’ వేదికగా ట్రంప్ వెల్లడించారు. ఈ టారిఫ్ ను వెంటనే తొలగించకపోతే ఫ్రాన్స్, ఈయూ ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల నుంచి వచ్చే అన్ని వైన్లు, షాంపైన్లు, ఆల్కహాల్ ఉత్పత్తులపై అమెరికా త్వరలోనే 200శాతం సుంకాన్ని విధిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. కాగా, ఒకరోజు ముందు ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈయూసైతం అమెరికాపై సుంకాలను విధించింది.

 

ఇదిలాఉంటే.. అమెరికాతో సుంకాల వివాదం నెలకొన్న నేపథ్యంలో జీ-7 దేశాల దౌత్యవేత్తలు గురువారం కెనడాలో భేటీ అయ్యారు. ఐరోపా వైన్ పై 200శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ భేటీ జరిగింది.

 

ఇదిలాఉంటే.. ఈయూ గణంకాల సంస్థ యూరోస్టాట్ ప్రకారం.. గత సంవత్సరం ఈయూ నుండి అమెరికాకు 4.9 బిలియన్ యూరోల విలువైన వైన్ ఎగుమతి అయింది. ఇది ఈయూ నుంచి జరిగే మొత్తం వైన్ ఎగుమతుల్లో 29శాతం. అమెరికాకు ఈయూ ఎగుమతుల్లో దాదాపు సగం ఫ్రాన్స్ వాటా, మరియు దాదాపు 40శాతం ఇటలీకి వెళ్తుంది. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ పడిపోయాయి. యూరోపియన్ స్పిరిట్ తయారీదారుల షేర్లు కూడా పడిపోయాయి. ట్రంప్ సుంకాలపై అధికంగా దృష్టిపెట్టడం వల్ల పెట్టుబడిదారులు, వినియోగదారులు, వ్యాపారుల విశ్వాసం సన్నగిల్లింది. ఆర్థిక మాండ్యం భయాలు పెరిగాయి.