Viral Fever Cases : ఢిల్లీని వణికిస్తున్న జ్వరాలు…డెంగీ, స్వైన్ ఫ్లూ, వైరల్ ఫీవర్ కేసులు

Viral Fever Cases

Viral Fever Cases : దేశ రాజధాని నగరమైన ఢిల్లీని జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వైరల్ ఫీవర్, డెంగీ కేసులు పెరుగుతున్నాయని నగర వైద్యులు చెప్పారు. ఢిల్లీలో ఇటీవల సంభవించిన వరదలతో గత మూడు వారాల్లో డెంగీ కేసులు రెట్టింపు అయ్యాయి. గత ఆరేళ్లలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా ప్రకటనలో తెలిపింది. (Dengue, Viral Fever Cases Increase In Delhi-NCR) ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో డెంగీ, వైరల్ ఫీవర్ కేసులు పెరిగాయి.

Ethiopia Flight : ఇథియోపియా విమానం కాక్‌పిట్‌లో పొగ…ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఢిల్లీ నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్‌ఫ్లుఎంజా, డెంగీ వంటి వైరల్‌, స్వైన్‌ ఫ్లూ, టైఫాయిడ్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి. డెంగీ జ్వరాలతో ప్లేట్ లెట్ల కౌంట్ తగ్గి ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య పెరిగిందని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ చెప్పారు.

Nipah in Kerala : కేరళలో నిపా వైరస్ కలవరం…పెరుగుతున్న కేసులు

రోగులు జ్వరాలతోపాటు అనారోగ్యం, బలహీనత, కీళ్ల నొప్పులు, దగ్గు, వాంతులు, అధిక గ్రేడ్ జ్వరంతో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఫ్లూ లాంటి లక్షణాలతో వచ్చేవారిలో 20-25 శాతం పెరుగుదల ఉందని గురుగ్రామ్‌లోని సికె బిర్లా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ లీడ్ కన్సల్టెంట్ తుషార్ తయాల్ చెప్పారు. హెపటైటిస్, టైఫాయిడ్ జ్వరాలతో జనం అవస్థలు పడుతున్నారు.

Jammu and Kashmir : అనంత్ నాగ్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీ మృతి

ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్‌లకు చెందిన 9వేల మంది నివాసితులను సర్వే చేయగా, గత నెల కంటే ఇప్పుడు 50 శాతం కుటుంబాలు అనారోగ్యంతో బాధపడుతున్నాయని వెల్లడైంది. జ్వరంతో బాధపడుతన్న వారు వెంటనే ఆసుపత్రుల్లో తమను సంప్రదించాలని వైద్యులు సూచించారు. జ్వరాల జోరుతో వణుకుతున్న ఢిల్లీలో కరోనా కేసులు మాత్రం లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.