Dense Fog in Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టును కమ్ముకున్న పొగ మంచు.. 100కుపైగా విమానాలు ఆలస్యం

పొగ మంచు ప్రభావంతో చీకటి అలుముకోవడం వల్ల విమానాలు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయాయి. దాదాపు 118 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవన్నీ డొమెస్టిక్ విమానాలే. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.

Dense Fog in Delhi: ఉత్తరాది రాష్ట్రాలను పొగ మంచు కమ్మేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. పొగమంచు ప్రభావం రవాణా వ్యవస్థపై పడుతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును పొగమంచు కమ్మేసింది.

Telangana : కారులో పడేసి వ్యక్తి సజీవ దహనం..సగం కాలిన బాడీ చూసి హడలిపోయిన స్థానికులు

దీంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. పొగ మంచు ప్రభావంతో చీకటి అలుముకోవడం వల్ల విమానాలు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయాయి. దాదాపు 118 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవన్నీ డొమెస్టిక్ విమానాలే. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఎయిర్‌పోర్టు పరిధిలో దారి కనిపించకపోవడంతో మూడు విమానాలను అధికారులు దారి మళ్లించారు. షార్జా నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానంతోపాటు, అహ్మదాబాద్, పూనేల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాల్ని జైపూర్ పంపించారు.

Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి.. సాధారణంకన్నా 3-5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

భారత వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. పంజాబ్, రాజస్థాన్, బిహార్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లో పొగ మంచు పొరలాగా కమ్ముకున్నట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పొగ మంచు ప్రభావంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ఈ విషయంపై ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని, దీనికోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ రేటు ఉదయం ఐదున్నర గంటల సమయంలో 0 మీటర్లుగా ఉందంటే అక్కడి పరిస్థితిని అంచనావేయొచ్చు.