Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి.. సాధారణంకన్నా 3-5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

చాలా చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 5 డిగ్రీల వరకు తక్కువ నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయి. ఇక్కడ సాధారణంకంటే 4.6 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.

Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి.. సాధారణంకన్నా 3-5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

Telangana: తెలంగాణను చలి వణికిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. చాలా చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 5 డిగ్రీల వరకు తక్కువ నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయి.

BRS Public Meeting : ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలకు ఆహ్వానం

ఇక్కడ సాధారణంకంటే 4.6 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ)లో 4.8 డిగ్రీల టెంపరేచర్ నమోదుకాగా, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని మంగపల్లెలో 5.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌లో 5.4 డిగ్రీలు, కామారెడ్డి జిల్లాలోని డోంగ్లిలో 5.5 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేటలో 5.6 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కలో 5.6 డిగ్రీలు, నల్లవల్లిలో 5.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రం నుంచి తెలంగాణవ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది. రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

Chandrababu-Pawan Kalyan Meeting : చంద్రబాబు, పవన్ భేటీతో వేడెక్కిన ఏపీ పాలిటిక్స్.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయా?

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, సికింద్రాబాద్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, కార్వాన్, ఉప్పల్ ప్రాంతాల్లో టెంపరేచర్ భారీగా తగ్గిపోయింది. ఈ ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చలి నుంచి రక్షణ పొందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.