Karnataka : అగ్నికేళి.. ఒకరిపై ఒకరు కాగడాలు విసురుకున్నారు

కర్నాటకలోని మంగళూరులో కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయం ఉంది. ఇక్కడ 8 రోజుల పాటు ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. జాతరలో భగభగమండే కాగడాలను...

Agni Kheli Festival : వివిధ ఆలయాల్లో ఒక్కోరకమైన సంప్రదాయం ఉంటుంది. కొన్ని గుళ్లల్లో అగ్నిగుండంలో నడుస్తుంటారు. మరికొంతమంది శరీరానికి ఇనుప కొక్కెలు తగిలించుకుంటుంటారు. భక్తి శ్రద్ధల మధ్య పూజలు నిర్వహిస్తుంటారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం ఒకరిపై ఒకరు మంటలతో వెలిగిపోతున్న పొడవాటి కొబ్బరి మట్టలను విసురుకుంటుంటారు. అత్యంత ప్రమాదకరంగా సాగే ఈ క్రీడ అనావాయితీగా వస్తోందంటారు. ఒళ్లుగొగురుపొడిచే ఈ సన్నివేశాలు కర్నాటకలో కనిపిస్తాయి. కర్నాటకలోని మంగళూరులో కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయం ఉంది. ఇక్కడ 8 రోజుల పాటు ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. జాతరలో భగభగమండే కాగడాలను విసురుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారమని ఇక్కడి వారు పేర్కొంటుంటారు.

Read More : Alwar temple demolish: ఆ గుళ్ళు మళ్లీ కడతాం: అళ్వార్ జిల్లా అధికారులు

ప్రమాదకరమైన ఈ ఆటలో పాల్గొనేందుకు అక్కడి స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఆటకు ‘అగ్నికేళి’ అని పేరు పెట్టారు. ఈ ఆటలో గాయాలైపాలైనా పట్టించుకోరు. గాయాలైన భక్తులు వైద్యం చేయించుకోకుండా… కుంకమ నీళ్లను చల్లుతారు. కేవలం ధోతి మాత్రమే ధరించి పురుషులు ఇందులో పాల్గొంటారు. ఉత్సవాల్లో దేవుడిని ప్రసన్నం చేసుకొనేందుకు రెండు గ్రామస్తుల ప్రజలు ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకుంటుంటారు. అత్తూరు, కొడత్తూరు గ్రామాలకు సమీపంలోని వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

Read More : Crime news : పూజకోసం గుడికొచ్చిన భక్తురాలిని హత్యచేసిన పూజారి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

మొత్తం 8 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు. చివరి రోజు రెండు వర్గాలుగా విడిపోయి మండుతున్న పొడవాటి కొబ్బరి మట్టలను ఒకరిపైకి ఒకరు విసురుకుంటుంటారు. కేవలం ఒక భక్తుడు ఐదుసార్లు మాత్రమే కాగడాలను విసరాలన్నది నిబంధన. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే.. మంగళూరుకు 26 కిలోమీటర్ల దూరంలో కటిల్ దుర్గా పరమేశ్వరి ఆలయం కాంప్లెక్స్ ఉంది. నందిని నది ఒడ్డున దుర్గా దేవాలయం ఉంది. ఎన్నో శతాబ్దాలుగా అగ్నికేళి ఉత్సవాలను జరుపుతున్నారు. తాజాగా.. ఈ అగ్నికేళి ఉత్సవాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు