Indigo Airlines fined: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.5 లక్షలు జరిమానా విధించిన డీజీసీఏ

విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూ. 5 లక్షలు జరిమానా విధించింది

Indigo Airlines fined: విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూ. 5 లక్షలు జరిమానా విధించింది. విమాన ప్రయాణానికి వచ్చిన వికలాంగ బాలుడితో ఇండిగో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలో దర్యాప్తు అనంతరం సంస్థకు జరిమానా విధించింది డీజీసీఏ. ఒడిశాలో మే 7న జరిగిన ఈ ఘటనలో వివరాలు ఇలా ఉన్నాయి. ఒక వికలాంగ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి విమాన ప్రయాణ నిమిత్తం రాంచి విమానాశ్రయంకు వచ్చాడు. ఇండిగో సంస్థకు చెందిన విమానంలో వీరు ప్రయాణించాల్సి ఉండగా.. చక్రాల కుర్చీలో ఉన్న బాలుడిని చూసిన ఇండిగో సిబ్బంది ఆ బాలుడిని విమానంలో ఎక్కించడం కుదరదంటూ తేల్చి చెప్పారు.

other stories:AAP Rajya Sabha Nominees : ప‌ద్మశ్రీ గ్ర‌హీత‌ల‌కు రాజ్య‌స‌భ టికెట్లు.. ఆప్ సర్కార్ మరో సంచలనం

అదే సమయంలో బాలుడు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండగా..తమను ఎలాగైనా విమానంలోకి అనుమతించాలంటూ తల్లిదండ్రులు ఎయిర్ లైన్స్ సిబ్బందిని వేడుకున్నారు. అయినా కనికరించని సిబ్బంది బాలుడిని అతని తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ప్రయాణికుడొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..పౌర విమానయానశాఖ మంత్రికి ట్యాగ్ చేశారు. ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ఇండిగో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ఈమేరకు విచారణ అనంతరం బాలుడిపై నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా విధించింది డీజీసీఏ.

other stories: IIIT Placements: క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఐదుగురు ఐఐఐటీ విద్యార్థులకు రూ.కోటికి పైగా వేతనం

కాగా, ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తికి ఫ్లైట్ బోర్డింగ్ నిరాకరించాలా వద్దా అనే ప్రోటోకాల్ ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపైనా డీజీసీఏ నిర్ణయం తీసుకోనుంది. విమానాల్లో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక సామర్థ్యంగల వ్యక్తులను విమానంలోకి అనుమతించాలా వద్దా అనే విషయాన్ని ప్రస్తుతం ఎయిర్‌లైన్ గ్రౌండ్ సిబ్బంది నిర్ణయంపై ఆధారపడి ఉండగా ఆ అంశాన్ని పునరుద్ధరించనున్నారు. త్వరలో సవరించిన నియమాల ముసాయిదాను రెగ్యులేటరీ విడుదల చేస్తుంది. అలాంటి సందర్భాలలో ఎయిర్‌లైన్స్ డాక్టర్/లు మరియు ఫ్లైట్ కమాండర్‌ను సంప్రదించడం తప్పనిసరి చేస్తుంది డీజీసీఏ.

ట్రెండింగ్ వార్తలు