AAP Rajya Sabha Nominees : ప‌ద్మశ్రీ గ్ర‌హీత‌ల‌కు రాజ్య‌స‌భ టికెట్లు.. ఆప్ సర్కార్ మరో సంచలనం

దేశ రాజ‌కీయాల్లో స‌రికొత్త సంచ‌నాల‌కు శ్రీకారం చుడుతున్న ఆప్‌ తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పద్మశ్రీ గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు కేటాయించింది.(AAP Rajya Sabha Nominees)

AAP Rajya Sabha Nominees : ప‌ద్మశ్రీ గ్ర‌హీత‌ల‌కు రాజ్య‌స‌భ టికెట్లు.. ఆప్ సర్కార్ మరో సంచలనం

Aap Rajya Sabha Nominees

AAP Rajya Sabha Nominees : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప‌ద్మ‌శ్రీ అవార్డులు అందుకున్న ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతూ నిర్ణ‌యించింది. పంజాబ్ కోటా నుంచి ఆప్‌కు రెండు రాజ్య‌సభ సీట్లు దక్కాయి. అయితే, వీటికి తమ పార్టీ అభ్యర్థుల‌ను కాకుండా… అస‌లు రాజ‌కీయాల‌తో సంబంధం లేని విద్యావంతుల‌ను ఎంపిక చేయడం విశేషం. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం ఆప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

పంజాబీ సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ కోసం పాటు ప‌డుతూ ప‌ద్మ‌శ్రీ అవార్డు గెలుచుకున్న పారిశ్రామికవేత్త విక్ర‌మ్ జిత్ సింగ్ సాహ్ని, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు పాటుప‌డి ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కించుకున్న బ‌ల్బీర్ సింగ్ సీచేవాల్‌ల‌కు రాజ్యసభ సీట్లు కేటాయించింది.

ప్ర‌స్తుతం దేశంలోని ప‌లు రాష్ట్రాల కోటాలో ఖాళీ కానున్న‌ రాజ్య‌స‌భ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా పంజాబ్ కోటాలో ఖాళీ కానున్న సీట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలోని పార్టీ బ‌లాబాలాల మేర‌కు రెండు సీట్లూ అధికార ఆప్‌కే ద‌క్క‌నున్నాయి.

Rajya Sabha : దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్

సాహ్ని, బల్బీర్ సింగ్ లు సోమవారం తన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాలను జూన్ 10న ప్రకటిస్తారు. రాజ్యసభలో ఆప్ బలం 10కి పెరగనుంది. కాగా, కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ నుంచి ఒక్క రాజ్యసభ మెంబర్ కూడా లేరు. గత 70 ఏళ్ల కాలంలో ఇదే తొలిసారి. ప్రస్తుతం పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అంబికా సోనీ (కాంగ్రెస్), బల్విందర్ సింగ్ బుందర్ (శిరోమణి అకాలీ దల్) పదవీ కాలం జూలై 4తో ముగియనుంది.(AAP Rajya Sabha Nominees)

Arvind Kejriwal: “కన్నీళ్లు తెప్పించారు” భగవత్ మన్ నిర్ణయంపై కేజ్రీవాల్ కామెంట్

బల్బీర్ సింగ్ సీచెవాల్ ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు, సామాజిక కార్యకర్త. సట్లెజ్, బియాస్ నదుల ఉపనది అయిన 160 కి.మీ కాలీ బీన్‌ను పునరుద్ధరించినందుకు ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. పంజాబ్‌లోని వివిధ ప్రదేశాల్లో పేదల విద్య కోసం స్కూళ్లు, కాలేజీలు కూడా నిర్మించారు. సార్క్ పర్యావరణ అవార్డును అందుకున్నారు. దలైలామాచే చేతుల మీదుగా సత్కారం పొందారు. ఎకో బాబాగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రపంచ పర్యావరణ పరిరక్షకుల్లో టాప్ 30లో ఆయనను గుర్తించింది టైమ్ మేగజైన్.

Balbir Singh Seechewal

Balbir Singh Seechewal

వికమ్ జీత్ సింగ్ సాహ్నీ ఒక ఎంటర్ పెన్యూర్, విద్యావేత్త, పరోపకారి. ప్రపంచ పంజాబీ సంస్థకు అంతర్జాతీయ అధ్యక్షుడు. ఇటీవల, మూడు చార్టర్డ్ విమానాలను పంపడం ద్వారా 500 మంది ఆఫ్ఘన్ హిందువులు, సిక్కులను తరలించడంలో సహాయం చేశారు. భారత్ లో వారి పునరావాసంలో సాయం చేశారు. కోవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన సామాజిక సేవ విస్తృతంగా ప్రశంసించబడింది. SGPC ఆయన ఆదర్శప్రాయమైన సేవలకు అన్మోల్ సిఖ్ రత్తన్ అవార్డును ప్రదానం చేసింది.

Vikramjit Singh Sahney

Vikramjit Singh Sahney

వీరిద్దరిని రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఇద్దరు తమ అపారమైన అనుభవంతో రాజ్యసభలో చర్చలను మరింత మెరుగుపరుస్తారని, సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న అంశాలపై గట్టిగా తమ గళాన్ని వినిపిస్తారని కేజ్రీవాల్ ఆకాంక్షించారు.