Rajya Sabha : దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్

దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది.

Rajya Sabha : దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్

Rajya Sabha Elections

Rajya Sabha Elections : దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 57 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి షెడ్యూలు విడుదల చేసింది. మే 24న నోటిషికేషన్ రానుంది. మే 31 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది. జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరుగగా జూన్ 3 వరకు నామినేషన్ల ుపసంఘరణ గడువు ఇచ్చింది ఈసీ. ఎన్నిక జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు, తెలంగాణా నుంచి 2 స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, వై.ఎస్.చౌదరి, వేణుంబాక విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభుల పదవీకాలం జూన్ 21న పూర్తికావడంతో నాలుగు ఖాళీలు ఏర్పడనున్నాయి.

అలాగే తెలంగాణ నుంచి కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌ల పదవీకాలం జూన్ 21న పూర్తికానుండడంతో రెండు స్థానాలు ఖాళీ ఏర్పడనున్నాయి. ఆయా స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది.