విరేచనాలు, వికారం లేదా వాంతులు.. తొలి కరోనా లక్షణం ఇదే కావొచ్చు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.

  • Publish Date - April 1, 2020 / 03:43 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు. రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ గురించి విస్తృతంగా స్టడీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ లక్షణాల గురించి రోజుకో విషయం తెలుస్తోంది. ఇప్పటివరకు జ్వరం, జలుబు, దగ్గు.. కరోనా వైరస్ లక్షణాలుగా చెబుతూ వచ్చారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా సోకినట్టే అనే నిర్ధారణకు వస్తున్నారు. 

కడుపులో తేడాగా ఉందా? అయితే జాగ్రత్త పడాల్సిందే:
తాజాగా కొత్త విషయం తెలిసింది. కరోనా వైరస్ కొత్త లక్షణాలు బయటపడ్డాయి. విరేచనాలు, వాంతులు లేదా వికారం.. ఇవీ కూడా కరోనా లక్షణాలే అంటున్నారు డాక్టర్లు. తాము ట్రీట్ మెంట్ చేసిన కేసులను పరిశీలంచగా, కొంతమంది పేషెంట్లలో తొలుత ఈ లక్షణాలే బయటపడ్డాయని డాక్టర్లు తెలిపారు. ముందుగా కడుపు అప్ సెట్ అవుతుందన్నారు. జీర్ణ సమస్యలు తలెత్తుతాయన్నారు. ఆ తర్వాత విరేచనాలు స్టార్ట్ అవుతాయన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో దీనిపై కథనం పబ్లిష్ చేశారు. తమ దగ్గరికి వచ్చిన చాలామంది పేషెంట్లలో జీర్ణ సమస్యలు గుర్తించామన్నారు డాక్టర్లు.

కొవిడ్ 19 కేవలం దగ్గు మాత్రమే కాదు. ఊపిరితిత్తులపై ఫోకస్ పెట్టాం. ఎందుకంటే ప్రాణం పోవడానికి ప్రధాన కారణం అదే. అయితే వైరస్ సలైవా(లాలాజలం)లోకి ఎంటర్ అయితే, అది మింగితే, పేగుల్లోకి వెళ్లిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.

విరేచనాలు, వికారం, వాంతుల.. ఇవి కూడా కరోనా లక్షణాలే:
మొత్తంగా కరోనా వైరస్ సోకిన కొంతమంది విరేచనాలు, వికారం, వాంతుల అవుతున్నాయని డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలుతోంది. అయితే వారిలో జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ శ్వాస సంబంధ ఇబ్బందులు, లక్షణాలు అస్సలు లేకపోవడం విశేషం అని డాక్టర్లు చెప్పారు. సో.. ఇకపై విరేచనాలు, వికారం, లేదా వాంతులు లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవడం బెటర్. డాక్టర్ ని సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు