×
Ad

నరేంద్ర మోదీ చెవికి రింగ్ పెట్టుకున్నారా? ఒమన్ టూర్‌లో వీడియోలు వైరల్..

నరేంద్ర మోదీ విమానం దిగినప్పటి వీడియోలు, ఇమేజ్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం అవుతుంది.

Narendra Modi

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నరేంద్ర మోదీ ఒమన్ లో పర్యటిస్తున్నారు. జోర్డాన్, ఇథియోపియా తర్వాత ఆయన ఒమన్ లో అడుగుపెట్టారు. అక్కడ నరేంద్ర మోదీకి ఒమన్ డిప్యూటీ పీఎం సయ్యద్ సాహిబ్ బిన్ తారిక్ అల్ సయీద్ ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నరేంద్ర మోదీ చెవికి రింగ్ పెట్టుకున్నట్టుగా ఉన్న కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అది చెవిరింగే అని చాలా మంది భావించారు. నరేంద్ర మోదీ (Narendra Modi) పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానిక వేషభాషలను స్థానికులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ క్రమంలో ఒమన్ టూర్ లో కూడా అలాంటిదే జరిగి ఉంటుందని చాలా మంది భావించారు. అయితే, అసలు మోదీ పెట్టుకున్నది చెవి రింగు కాదు.

Also Read: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరు జిల్లాల కలెక్టర్ల బెస్ట్ ప్రాక్టీసెస్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ఆదేశాలు

నరేంద్ర మోదీ విమానం దిగినప్పటి వీడియోలు, ఇమేజ్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అది చెవి రింగ్ కాదు ట్రాన్స్ లేటర్ అని. ఔను. అది ట్రాన్స్ లేటరే. కాకపోతే చెవికి దగ్గరగా పెట్టుకోవడం, తెల్లగా ముత్యంలా మెరుస్తుండడంతో అది చెవికి ముత్యపు పోగు పెట్టుకున్నట్టుగా వీడియోల్లో కనిపిస్తుంది. ఒమన్ లో అరబిక్ మాట్లాడతారు.

దీంతో స్థానికులు ఏం మాట్లాడారో ఎప్పటికప్పుడు ట్రాన్స్ లేట్ అయ్యి వెంటనే మనకు తెలిసిన భాషలో వినిపిస్తుంది. ఇది చాలా మంది వరల్డ్ లీడర్లు వాడుతుంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ట్రాన్స్ లేటర్లు వినియోగించారు. కాకపోతే అవి హెడ్ సెట్స్ లా చాలా పెద్దగా ఉంటాయి. ఈ ట్రాన్స్ లేటర్లు కొంచెం చిన్నగా ఉంటాయి. అంతే తేడా.