బీజేపీ నేతలపై దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • Publish Date - September 1, 2019 / 05:54 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి తన వ్యాఖ్యలతో వేడి పుట్టించారు. బీజేపీ, భజరంగ్ దళ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI నుంచీ బీజేపీ, భజ్‌రంగ్ దళ్..భారీగా డబ్బు తీసుకున్నాయని ఆరోపించారు.

నిపై అందరూ దృష్టిసారించాలని కోరారు. ముస్లింల కంటే… ముస్లిమేతరులు… ISI తరపున గూఢచారులుగా పనిచేస్తున్నారని దిగ్విజయ్ సింగ్  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం అందరికీ అర్థం కావాల్సి అవసరం ఉందని దిగ్విజయ్ సింగ్. మరి డిగ్గీరాజా వ్యాఖ్యలపై బీజేపీ, భజరంగ్ దళ్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.