కారు కొనాలనే వారికి గుడ్ న్యూస్, రూ.80వేలు వరకు డిస్కౌంట్.. Tata Motors అదిరిపోయే ఆఫర్లు

కార్లు కొనాలనే వారికి పలు టాటా మోటార్స్ డీలర్ షిప్స్ గుడ్ న్యూస్ చెప్పాయి. కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. పలు మోడల్స్ కార్లపై రూ.80వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. అయితే కేవలం సెప్టెంబర్ నెలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ చేంజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో కస్టమర్లు లబ్ది పొందొచ్చు.
Tata Harrier Dark Edition
రూ.40వేలు exchange bonus
రూ.15వేలు కార్పొరేట్ డిస్కౌంట్
కాంపాక్ట్ SUV అన్ని వేరియంట్స్ పై రూ.25వేలు అడిషనల్ క్యాష్ డిస్కౌంట్
Nexon అన్ని వేరియంట్స్ పై రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్
డీజిల్ వేరియంట్స్ పై రూ.15వేలు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ప్రకటించారు.
Tata Tiago
రూ.15వేలు క్యాష్ డిస్కౌంట్
రూ. 10వేలు ఎక్స్ చేంజ్ బోనస్
రూ.7వేలు కార్పొరేట్ డిస్కౌంట్
Tigor
క్యాష్ డిస్కౌంట్ అండ్ ఎక్స్ చేంజ్ బోనస్ రూ.15వేలు
కార్పొరేట్ డిస్కౌంట్ రూ.7వేలు
కాగా, Altroz or Nexon EV మోడల్ కార్లపై ఎలాంటి ఆఫర్లు లేవు.
కరోనా కారణంగా ఆటో ఇండస్ట్రీ కూడా బాగా దెబ్బతింది. సేల్స్ భారీగా పడిపోయాయి. నష్టాలు చూడాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆటో ఇండస్ట్రీ మెల్లగా రికవరీ అవుతోంది. చాలా కార్ల కంపెనీలు… సొంతంగా బ్రాంచ్ తెరచి రన్ చేస్తున్నాయి. సేల్స్ పెంచుకునేందుకు ఆఫర్ల రూట్ ఫాలో అవుతున్నాయి. డిస్కౌంట్లు, ఈఎంఐల పేరుతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి.
https://10tv.in/amazon-sellers-are-bribing-users-for-five-star-reviews/
ఒక టాటా కంపెనీనే కాదు పలు కార్ల కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేసి సేల్స్ పెంచుకోవడానికి పోటీ పడుతున్నాయి. కొన్ని కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఇస్తుంటే, మరికొన్ని కంపెనీలు తగ్గింపుతో పాటు ఈఎంఐ సంబంధిత ప్రయోజనాలు కూడా ఇస్తున్నాయి. ఇటీవలే, ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో సెప్టెంబర్ నెలలో తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు తీసుకొచ్చింది. Buy Now, Pay In 2021 స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా కారు కొనుగోలు చేస్తే వెంటనే ఈఎంఐ చెల్లించాల్సిన పని లేదు. 2021 నుంచి అంటే 4 నెలల తర్వాత నుంచి ఈఎంఐ కడితే సరిపోతుంది.
అంతేకాకుండా కారు కొనుగోలుపై ఏకంగా రూ.70 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చని కంపెనీ తెలిపింది. క్విడ్, డస్టర్ వంటి మోడళ్లకు ఇది వర్తిస్తుంది. అయితే కార్లపై తగ్గింపు ఆఫర్లు పట్టణ, షోరూమ్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల దగ్గరిలోని రెనో షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ వివరాలు తెలుసుకోవాలని కంపెనీ కోరింది.
ఇక హోండా కార్ల కంపెనీ సైతం… కొన్ని కార్లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. అమేజ్ (Amaze), సివిక్ (Civic) లాంటి కార్లపై రూ.2.5 లక్షల దాకా ఆఫర్ ఉంది.