Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై దూకుడు పెంచిన డీఎంకే నేతలు.. హెచ్ఐవీ, కుష్ఠురోగమంటూ విరుచుకుపడ్డ ఎంపీ ఏ.రాజా

మలేరియా, డెంగ్యూ వంటి వాటివని తరిమికొట్టాలని ఉదయనిధి స్టాలిన్ మృదువుగా చెప్పారు. నిజానికి అవి హెచ్ఐవీ, కుష్ఠువ్యాధి లాంటివి. కాకపోతే ఈ వ్యాధులకు సామాజిక కళంకం లేదు. అయినప్పటికీ వాటిని అసహ్యంగా చూస్తారు. సనాతన ధర్మం అంత కంటే కూడా ఎక్కువే

DMK MP A Raja: సనాతన ధర్మ వివాదంపై ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ తమిళనాడులోని అధికార పార్టీ నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. సరికదా.. మరింత దూకుడు పెంచుతూ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా డీఎంకే నేత, ఎంపీ ఏ.రాజా ఈ వివాదంలోకి అడుగుపెట్టి మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం హెచ్ఐవీ, కుష్ఠురోగమంటూ ఆయన విరుచుకుపడ్డారు. అయితే ఈ వివాదంలో తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన విశ్వకర్మయోజన పథకాన్ని కూడా మధ్యలోకి లాగడం విశేషం.

Sanatana Remark : ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొడితే రూ.10 లక్షల బహుమానం : హిందూ సంస్థ పోస్టర్

గురువారం ఓ కార్యక్రమంలో భాగంగా ఏ.రాజా మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన వేరు వేరు కాదు. అవి రెండూ ఒకటే. వాటిని మలేరియా, డెంగ్యూ వంటి వాటివని తరిమికొట్టాలని ఉదయనిధి స్టాలిన్ మృదువుగా చెప్పారు. నిజానికి అవి హెచ్ఐవీ, కుష్ఠువ్యాధి లాంటివి. కాకపోతే ఈ వ్యాధులకు సామాజిక కళంకం లేదు. అయినప్పటికీ వాటిని అసహ్యంగా చూస్తారు. సనాతన ధర్మం అంత కంటే కూడా ఎక్కువే’’ అని అన్నారు.

Shivling : తన కోరిక తీర్చలేదని శివుడిపై యువకుడు కోపం, గుడిలో శివలింగాన్ని చోరీ చేసి ఏం చేశాడంటే..

అయితే తన వ్యాఖ్యలపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు. ఒకవేళ తన తలకు డిమాండ్ కట్టినా భయపడనని అన్నారు. 10 లక్షలైనా, కోటి రూపాయలైనా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. ఆయుధాలు పట్టుకొని వచ్చినా, ఢిల్లీలో అయినా అంబేద్కర్, పెరియార్ పుస్తకాలతో వస్తానని చర్చ చేస్తానని ఏ.రాజా అన్నారు.

Telangana Politics: తెలంగాణ ఎన్నికల వేళ ఎన్నో సిత్రాలు.. సిద్ధాంతాలు, భావోద్వేగాలు మాటలకే పరిమితా?

ఇక ఉదయనిధిని తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం వెనకేసుకొచ్చారు. సనాతన ధర్మం ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకమని అన్నారు. ఉదయనిధి తప్పేమీ చెప్పలేదని, అయితే తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్పందించారు. ఈ విషయమై సరైన సమాధానాలు ఇవ్వాలని బుధవారం జరిగిన సమావేశంలో తన మంత్రులకు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు