Patient cheated the doctor : నకిలీ రూ.500 నోటు ఇచ్చి డాక్టర్‌ని మోసం చేసిన పేషెంట్

ఇప్పుడన్నీ ఆన్ లైన్ చెల్లింపులు జరుగుతున్నా.. కొందరు ఇంకా కరెన్సీ నోట్లకే ప్రియార్టీ ఇస్తున్నారు. అయితే నోట్ల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మోసపోయినట్లే. ఓ డాక్టర్ దగ్గరకి వచ్చిన పేషెంట్ నకిలీ రూ.500 నోటు అంటగట్టి చిత్తగించాడు. ఈ విషయాన్ని డాక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Patient cheated the doctor

Patient cheated the doctor : ఇప్పుడంతా పేటీఎం, జీపే, ఫోన్ పే వంటి యాప్‌లు కస్టమర్లు వాడుతున్నప్పటికీ ఇంకా కొంతమంది డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కరెన్సీ నోట్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలనే విషయం డాక్టర్ మనన్ వోరా ద్వారా మరోసారి రుజువైంది. ఆయనకు పేషెంట్ నకిలీ రూ.500 నోటు ఇచ్చి ఎలా మోసం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Haryana : డాక్టర్ వృత్తిని విడిచిపెట్టి వ్యాపార రంగంలో దూసుకుపోతున్న డైనమిక్ లేడీ… ఎవరంటే..

డాక్టర్ మనన్ వోరా ఆర్థోపెడిక్ సర్జన్ , హెల్త్ కంటెంట్ రైటర్‌గా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో కొత్త ప్లాట్ ఫారమ్ థ్రెడ్స్‌కు వెళ్లి తనకు ఇటీవల జరిగిన ఓ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ట్రీట్మెంట్‌కి వచ్చిన ఓ పేషెంట్ నకిలీ రూ.500 ల నోట్ ఇచ్చి బిల్లు చెల్లించాడు. అతని నుంచి తీసుకునేటపుడు రిసెప్షనిస్ట్ నోటును గమనించలేదు. తీరా పేషెంట్ వెళ్లిపోయాడు. ;తనకు చెల్లించాల్సిన ఫీజు విషయంలో ప్రజలు కూడా ఎలా మోసం చేస్తారో చూడండి’ అంటూ మనన్ వోరా తన పోస్టులో చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Mumbai : ‘ప్రెగ్నెంట్ మ్యాన్’.. నిజంగానే అతని కడుపులో కవలలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు

‘అది నకిలీ నోట్ అని క్లియర్‌గా తెలుస్తోంది.. ఎంత అందంగా అటాచ్ చేశారు’ అని ఒకరు. ‘అతను ఎవరైనా మేధావి అయి ఉండాలి.. లేదా మీరే మేధావి అయి ఉండాలి’ అని మరొకరు కామెంట్లు పెట్టారు. పేషెంట్ కావాలనే మోసం చేశాడో.. అతను కూడా వేరెవరి దగ్గరైనా ఈ నకిలీ నోటు తీసుకుని మోసపోయాడో తెలియదు కానీ అందరూ కరెన్సీ నోట్లు తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలని అలెర్ట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు