Pranav Balasubramanian : కాలికి కరోనా టీకా ఇచ్చిన వైద్యులు

చేతులు లేని యువకుడికి టీకా ఇచ్చారు వైద్యులు, కేరళలోని పాలక్కడ్ జిల్లాలో కు చెందిన ప్రణవ్ చేతులు లేకుండా జన్మించాడు. కాగా ఆదివారం కాలికి టీకా ఇచ్చారు వైద్యులు

Pranav Balasubramanian : కేరళలో చేతులు లేని యువకుడికి టీకా వేశారు వైద్య సిబ్బంది. పాలక్కడ్ జిల్లా అలథూర్ నివాసి ప్రణవ్ బాల సుబ్రహ్మణ్యం(22) రెండు చేతులు లేకుండా జన్మించాడు. అతడికి చేతులు లేకపోయిన సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు. ఇక కరోనా మహమ్మారి నేపథ్యంలో టీకా తీసుకొనేందుకు వైద్యాధికారులను సంప్రదించాడు సుబ్రహ్మణ్యం.

చేతులు లేకపోవడంతో టీకా ఎక్కడ ఇవ్వాలో తెలియక సతమతమయ్యారు వైద్యులు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులను సంప్రదించారు. టీకా కాలుకి కూడా ఇవ్వొచ్చని చెప్పడంతో అతడి కాలుకి టీకా ఇచ్చారు. కేరళ రాష్ట్రంలో కాలికి టీకా తీసుకున్న మొదటి వ్యక్తి సుబ్రహ్మణ్యం అని వైద్యాధికారులు తెలిపారు.

కాగా డిగ్రీ పూర్తి చేసిన సుబ్రహ్మణ్యం పెయింటింగ్స్ వేస్తూ జీవిస్తున్నాడు. కేరళ వరదల సమయంలో తాను దాచుకున్న రూ.5 వేలను సీఎం సహాయ నిధికి అందించారు. 2019లో తన పుట్టిన రోజును సీఎం పినారయి విజయం కార్యాలయంలో జరుపుకున్నారు. ఈ సందర్బంగా సీఎంతో సెల్ఫీ కూడా దిగారు సుబ్రహ్మణ్యం.

ట్రెండింగ్ వార్తలు