Uddhav Thackeray
Uddhav Thackeray : అసలే కరోనా కాలం.. మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో బయటకు రావొద్దంటే ఊరుకుంటారా? బహిరంగ ప్రదేశాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దంటే వింటారా? కరోనా కట్టడి చేసేందుకు కొవిడ్ నిబంధలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ చాలామంది నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై స్పందించిన ముంబై సీఎం ఉద్దవ్ ఠాక్రే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కొవిడ్ నిబంధలను ఉల్లంఘించి సాటివారి జీవితాలకు ముప్పుగా మారొద్దనని ఆయన హెచ్చరించారు. కరోనా ఏజెంట్లుగా మారొద్దని సూచించారు. కరోనా థర్డ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉందని, ఇన్ఫెక్షన్ల రేటు చాలా అధికంగానే ఉందన్నారు. కరోనా థర్డ్ వేవ్ తీవ్రతపై చర్చించుకోవడం మానేయాలన్నారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్యారోగ్య మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడే ముప్పగా మారుతుందని సీఎం ఠాక్రే హెచ్చరించారు.
లాక్ డౌన్లు, ఆంక్షలతో కరోనాను పూర్తిగా నిర్మూలించలేమన్నారు. కరోనా వ్యాప్తిని మాత్రం కట్టడి చేయగలమని చెప్పారు. మన చట్టాలు, నియంత్రణలతో కరోనా సవాళ్లను అధిగమించలేమన్నారు. అందుకే ప్రతిఒక్కరూ కరోనా నిర్మూలనకు పాటుపడాలని చెప్పారు. ప్రతి పౌరుడు బాధ్యతగా తనకు తాను కరోనా నియంత్రణలో భాగస్వామి కావాలని సూచించారు.
అందుకు అందరూ చేయాల్సిందిల్లా.. కరోనా నిబంధలను పాటించడమేనన్నారు. అలా కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మీతో పాటు మీ కుటుంబాన్ని మీతో కలిసి ఉండే తోటివారికి కూడా ప్రమాదకంగా మారుతారని సీఎం ఠాక్రే హెచ్చరించారు. కరోనా నిబంధనలను పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం ఠాక్రే హెచ్చరించారు.
Read Also : AP Corona Cases : ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు.. చిత్తూరులో అత్యధికంగా…