AP Corona Cases : ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు.. చిత్తూరులో అత్యధికంగా…

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో..

AP Corona Cases : ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు.. చిత్తూరులో అత్యధికంగా…

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. కాగా, నిన్నటి (1257)తో పోలిస్తే కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 984 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనాతో ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదు. గడిచిన 24 గంటల్లో 24వేల 280 శాంపిల్స్ పరీక్షించారు. నిన్న ఒక్కరోజే 152 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,16,30,231 శాంపిల్స్ పరీక్షించారు.

తాజాగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 244 కేసులు వెలుగుచూశాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. విశాఖలో 151 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 117 కేసులు రికార్డ్ అయ్యాయి.

WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది.. మీ చాట్ బాక్సు ఫిల్టర్ చేసేస్తుంది..!

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,82,843. రాష్ట్రంలో మొత్తం 5వేల 606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,732 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 505గా ఉంది.

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రభావం భారత్‌లో కనిపిస్తోంది. అనుకున్న దానికంటే శరవేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. గత 10 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 50వేల లోపు నమోదైన కరోనా కేసులు ఇప్పుడు లక్ష 50 వేలకు పైగా నమోదవుతున్నాయి.

Curry Bananas : కూర అరటిలో ఫైబర్ అధికం…బరువు తగ్గటం ఖాయం

తాజాగా దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే ఒక లక్షా 79వేల 723 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 146 మంది కోవిడ్ తో చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 4,033కు చేరుకుంది.